చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ‘బంట్రోతు’ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ!

0
45

  • గవర్నర్ ప్రజా సమస్యలను ప్రస్తావించలేదు
  • అధికార, విపక్ష సభ్యులంతా ప్రజలకు బంట్రోతులే
  • ఏపీ అసెంబ్లీ వద్ద మీడియాతో హిందూపురం ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గరవ్నర్ నరసింహన్ ప్రజా సమస్యలపై మాట్లాడలేదని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ట తెలిపారు. ‘టీడీపీ నేత అచ్చెన్నాయుడు చంద్రబాబుకు బంట్రోతు’ అని వైసీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పడంపై బాలయ్య కౌంటర్ ఇచ్చారు. ఈరోజు అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నేతలంతా ప్రజలకు బంట్రోతులేనని బాలకృష్ణ స్పష్టం చేశారు.

‘ఎవరు అయితేనేం.. మనం ప్రజా సేవకులం. అధికారంలో ఉండొచ్చు. ప్రతిపక్షంలో ఉండొచ్చు. అందరూ ప్రజల బంట్రోతులే. ప్రజల కోసం కష్టపడటానికి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులం’ అని వ్యాఖ్యానించారు. ఈ 15 రోజుల వైసీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? అని మీడియా ప్రశ్నించగా, ‘మరికొంత కాలం వేచిచూద్దాం’ అని బాలయ్య జవాబిచ్చారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here