సన్మానించేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ..

0
62

  • జిల్లా పరిషత్ సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం
  • పెద్దిరెడ్డికి శాలువా కప్పేందుకు యత్నించిన దొరబాబు
  • సున్నితంగా తిరస్కరించిన మంత్రి

చిత్తురు జిల్లాలో నిన్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు కూడా వచ్చారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డికి శాలువా కప్పి, సన్మానించేందుకు దొరబాబు యత్నించగా… ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీంతో, పెద్దిరెడ్డిని సన్మానించే కార్యక్రమాన్ని ఆయన విరమించుకున్నారు. అయితే, సన్మానాన్ని పెద్దిరెడ్డి ఎందుకు తిరస్కరించారనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here