ఇదే నిజమైతే ఈదఫా వరల్డ్ కప్ పాకిస్థాన్ దే… గ్యారెంటీ అంటున్న ఫ్యాన్స్!

0
50

  • 1992లో ఇమ్రాన్ నేతృత్వంలో గెలిచిన పాక్
  • నాడు ఏం జరిగిందో నేడు కూడా అదేలా
  • కప్ తమదేనని చెబుతున్న పాక్ అభిమానులు

అవును… ఈ మాటను బల్లగుద్ది మరీ చెబుతున్నారు పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్. పాకిస్థాన్ తన చరిత్రలో 1992లో వరల్డ్ కప్ ను సాధించిందన్న సంగతి తెలిసిందే. ఆపై మరెన్నడూ కప్ ను ఆ జట్టు అందుకోలేదు. అయితే, ఇప్పుడు కనిపిస్తున్న సెంటిమెంట్ నిజమైతే, పాక్ దే కప్ అని అనుకోక తప్పదేమో. 1992లో పాకిస్థాన్ వరల్డ్ కప్ లో ఆడిన వేళ, ఏం జరిగిందో, ఇప్పుడూ సరిగ్గా అలాగే జరుగుతుండటం గమనార్హం.

1992లో తొలి మ్యాచ్ లో ఓడిన పాక్, రెండో మ్యాచ్ గెలువగా, మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆపై నాలుగు, ఐదవ మ్యాచ్ లను ఓడిపోయిన పాక్, సెమీస్ పై ఆశలను వదిలేసుకుంది. ఆపై ఆరు, ఏడవ మ్యాచ్ లలో పాకిస్థాన్ గెలిచిన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని జట్టు, అదే ఊపుతో కప్పును ఎగరేసుకు పోయింది. ఇక ప్రస్తుత మ్యాచ్ లలోనూ పాక్ పయనం సరిగ్గా 17 ఏళ్ల నాడు ఎలా జరిగిందో అలాగే జరగడం గమనార్హం. యాదృశ్చికమే అయినా, ఇప్పుడు కూడా పాక్ జట్టే విజయం సాధించి, సగర్వంగా స్వదేశానికి వస్తుందని అంటున్నారు ఫ్యాన్స్.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here