కారును సరస్సులోకి దూకించి సైకియాట్రిస్ట్‌ ఝాన్సీ ఆత్మహత్య!

0
47

  • 40 ఏళ్లకు పైగా అమెరికాలో సేవలు
  • ఆత్మహత్య చేసుకోవడంతో దిగ్భ్రాంతి
  • సంతాపం తెలిపిన టాంటెక్స్

అమెరికాలో సైకియాట్రిస్ట్‌ గా ఎంతో పేరు తెచ్చుకున్న ప్రవాస తెలుగు మహిళా డాక్టర్‌ ఝాన్సీ రాజ్‌ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. టెక్సాస్‌ పరిధిలోని ఫోర్ట్‌ వర్త్‌ లో నివాసం ఉండే ఆమె, తన కారును డ్రైవ్‌ చేసుకుంటూ తీసుకెళ్లి సరస్సులోకి దూకించి సూసైడ్ చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఎంతో చురుకుగా, ధైర్యంగా ఉండే ఝాన్సీ ఇలా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారన్న విషయం తెలియరాలేదు. కాగా, 1995లో ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌) అధ్యక్షురాలిగానూ పని చేసిన ఆమె, ఎంతో మంది తెలుగువారికి సాయపడ్డారు. ఝాన్సీ హఠాన్మరణం పట్ల టాంటెక్స్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. ఝాన్సీ గత నాలుగు దశాబ్దాలకు పైగా అమెరికాలో వైద్య సేవలను అందిస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here