సిరిసిల్లలో సినారె లైబ్రరీ.. మరికాసేపట్లో ప్రారంభించనున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్!

0
81

  • సంతోషంగా, గర్వంగా ఉందన్న కేటీఆర్
  • టెక్నాలజీ యుగంలో పుస్తకాలను బతికించడం కోసం చిరుప్రయత్నం
  • రూ.3.60 కోట్లతో గ్రంథాలయం నిర్మాణం

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జిల్లా కేంద్ర లైబ్రరీని ప్రారంభించనున్నారు. సి.నారాయణ రెడ్డి (సినారె)గా లైబ్రరీగా నామకరణం చేసిన ఈ గ్రంథాలయాన్ని ఈరోజు ప్రారంభిస్తానని కేటీఆర్ తెలిపారు. ఈ లైబ్రరీని ప్రారంభించడం తన సంతోషంగా, గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు.

టెక్నాలజీ యుగంలో పుస్తకాలను బతికించడం కోసం ఇది చిరుప్రయత్నమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్ల పట్టణంలో రూ.3.60 కోట్లతో ఈ గ్రంథాలయాన్ని నిర్మించారు. మరికాసేపట్లో ఈ గ్రంథాలయాన్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here