‘సైకో సయాన్’ టీజర్ విడుదల!

0
87

  • శ్రద్దాకపూర్-ప్రభాస్ జంటగా సాహో
  • ఆగస్టు 15న సినిమా రిలీజ్ కు సన్నాహాలు
  • తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో ఒకేసారి రిలీజ్

బాహుబలి సిరీస్ తర్వాత హీరో ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్ తో సాహో సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. సాహో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ప్రేక్షకులను ఊరించేలా ‘సైకో సయాన్’ పాట టీజర్ ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో వచ్చే నెల 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శ్రద్దాకపూర్ నటించింది. ఈ ‘సైకో సయాన్’ పాటను మీరూ చూసేయండి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here