దుమ్మురేపేస్తోన్న ‘ఓ బేబీ’ .. 3 రోజుల వసూళ్లు

0
76

  • ఈ నెల 5న థియేటర్లకు వచ్చిన ‘ఓ బేబీ’
  • 3 రోజుల్లో 17 కోట్ల గ్రాస్ వసూలు
  •  ఖుషీ అవుతోన్న సమంత అభిమానులు

సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఓ బేబీ’ .. ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా, తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. నటన పరంగా సమంత ఫుల్ మార్కులు కొట్టేసింది.

మౌత్ టాక్ కారణంగా ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. అలా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో ఈ సినిమా 17 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో, ఈ వారాంతం వరకూ ఈ సినిమా వసూళ్ల పరంగా తన జోరును చూపించే అవకాశాలు వున్నాయి. ‘రంగస్థలం’ .. ‘మజిలీ’ తరువాత ‘ఓ బేబీతో సమంతకి మరో హిట్ పడటంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here