మానసిక వికలాంగురాలిని ఎత్తుకెళ్లి.. దారుణం

0
60

  • మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన
  • బయట నిద్రిస్తున్న మానసిక వికలాంగురాలిని ఎత్తుకెళ్లి అత్యాచారం
  • కామాంధుడిని చితకబాదిన గ్రామస్తులు

సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. అమాయకురాలైన ఓ మానసిక వికలాంగురాలిని ఓ కామాంధుడు కాటువేశాడు. వివరాల్లోకి వెళ్తే, బయ్యారం మండలంలోని ఓ గ్రామంలో రాత్రి మానసిక వికలాంగురాలు ఇంటి బయట నిద్రిస్తోంది. రాత్రి 10 గంటల సమయంలో అక్కడకు వచ్చిన ఓ కామాంధుడు ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశానికి ఎత్తెకెళ్లాడు. ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. నిద్ర నుంచి మేల్కొన్న కుటుంబసభ్యులు ఆమె కోసం ఇతర గ్రామస్తులతో కలసి గ్రామమంతా వెతికారు. చివరకు గ్రామ శివారులో ఆమె అచేతన స్థితిలో కనిపించింది. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో కామాంధుడిని అక్కడే పట్టుకుని చితకబాదారు. జరిగిణ ఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here