వితండవాదానికి నా అకౌంట్ లో స్థానంలేదు.. వారందరినీ బ్లాక్ చేసేస్తున్నా!: యాంకర్ అనసూయ భరద్వాజ్

0
75

  • కొందరు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు
  • వీళ్లందరిని నేను బ్లాక్ చేస్తున్నా
  • ఇలా చేసే సంపూర్ణ హక్కు నాకు ఉంది

కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలిపింది.  అలాంటివారిని తాను బ్లాక్ చేస్తున్నానని చెప్పింది. ఇలా బ్లాక్ చేసే హక్కు తనకు ఉందని స్పష్టం చేసింది. ట్విట్టర్ లో అనసూయ స్పందిస్తూ..‘వితండవాదానికి నా అకౌంట్(ట్విట్టర్) పేజీలో స్థానం లేదు. నా ట్విట్టర్ హ్యాండిల్ లో దురుద్దేశంతో అనుచిత కామెంట్లు చేస్తున్నవారందరినీ బ్లాక్ చేస్తున్నా. ఇది నా అకౌంట్. నేను ప్రశాంతంగా ఉండటానికి ఏది కావాలనుకుంటే అది చేసే హక్కు నాకు ఉంది’ అని అనసూయ భరద్వాజ్ ట్వీట్ చేసింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here