ద్విగ్విజయ్ సింగ్ నా మెడలో తాళి కట్టారు: టీవీ జర్నలిస్ట్ అమ్రితా రాయ్

0
62

  • తమిళనాడులో వివాహం
  • హిందు సంప్రదాయం ప్రకారం పెళ్లి
  • ఫేస్ బుక్ లో వెల్లడించిన అమ్రిత

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, తనను తమిళనాడులో వివాహం చేసుకున్నారని టీవీ జర్నలిస్ట్ అమ్రితా రావు స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ ను పెట్టారు. ఆయన ఆస్తిపాస్తులపై తనకు ఆశ లేదని, వాటిని ఆయన తన బిడ్డలకే పంచివ్వాలని కోరానని అన్నారు. తమ పెళ్లి హిందూ సంప్రదాయంలో జరిగిందని, ఆపై వివాహాన్ని రిజిస్టర్ చేయించామని అమ్రిత వెల్లడించారు. గత సంవత్సరం ఆగస్టులోనే వీరిద్దరి వివాహం జరిగిందని వార్తలు వచ్చినా, అధికారిక ప్రకటన వెలువడటం మాత్రం ఇదే తొలిసారి. ప్రస్తుతం 68 సంవత్సరాల వయసులో ఉన్న దిగ్విజయ్, 44 ఏళ్ల అమ్రిత, హనీమూన్ నిమిత్తం యూఎస్ వెళ్లినట్టు తెలుస్తోంది. అమ్రిత, తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి, దిగ్విజయ్ సింగ్ కు దగ్గరయ్యారు. ఆమెతో తాను సంబంధాన్ని నడుపుతున్నానని, దాన్ని అంగీకరించేందుకు సంకోచించడం లేదని గత సంవత్సరం ఏప్రిల్ లో దిగ్విజయ్ వ్యాఖ్యానించి పెను సంచలనాన్నే రేపారు. దిగ్విజయ్ మొదటి భార్య ఆశా శింగ్, 2013లో క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. వారికి కుమారుడు జయవర్ధన్ సింగ్ తో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here