స్పీకర్, గవర్నర్ ను కలిసి ప్రస్తుత పరిస్థితులపై వివరిస్తాం: యడ్యూరప్ప

0
69

  • కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం
  • విధానసౌధ ముందు ధర్నా చేస్తామన్న యడ్డీ
  • చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుంది: మంత్రి శివకుమార్

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్పీకర్, గవర్నర్ ను కలిసి ప్రస్తుత పరిస్థితులను వివరిస్తామని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు. కర్ణాటక విధానసౌధ ముందు ధర్నా చేయాలని నిర్ణయించామని చెప్పారు.

మరోపక్క, అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు మంత్రి శివకుమార్ ముంబై వెళ్లారు. శివకుమార్ తో పాటు జేడీఎస్ ఎమ్మెల్యే శివలింగగౌడ కూడా ఉన్నారు. శివకుమార్ ను హోటల్ లోనికి అనుమతించబోమని పోలీసులు తెలిపినట్టు సమాచారం.

తనను పలకరించిన మీడియాతో శివకుమార్ మాట్లాడుతూ, తన స్నేహితులను కలిసేందుకు ముంబై వచ్చానని, ఇక్కడి హోటల్ లో గది బుక్ చేసుకున్నానని చెప్పారు. చిన్న సమస్య ఉందని, అది చర్చల ద్వారా పరిష్కారమవుతుందని అన్నారు. ఉన్నపళంగా తాము విడిపోవాలనుకోవట్లేదని స్పష్టం చేశారు. ’మేము ప్రతిఒక్కరినీ ప్రేమతో చూస్తాం. ఎమ్మెల్యేలను కలవకుండా వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని’ శివకుమార్ స్పష్టం చేశారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here