ఏపీఐఐసీ చైర్ పర్సన్‌గా రోజా నియామకం.. ఉత్తర్వులు జారీ!

0
54

  • పలు సమీకరణల కారణంగా రోజాకు దక్కని మంత్రి పదవి‌
  • ఎట్టకేలకు కీలక పదవి
  • టీటీడీ స్పెషల్ ఆఫీసర్‌గా ధర్మారెడ్డి

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏ‌పీఐఐసీ) చైర్ పర్సన్‌గా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. అయితే, పలు సమీకరణాల కారణంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆమెను ఏఐసీసీ చైర్ పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

మరోవైపు, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్‌లో పనిచేసి కేంద్ర సర్వీసులోకి వెళ్లిన ఏవీ ధర్మారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది. టీటీడీ జేఈవోగా తిరిగి రావాలన్న ఆయన కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో కేంద్రం ఆయన డిప్యుటేషన్‌కు అంగీకరించింది. బుధవారమే విధుల నుంచి రిలీవ్ అయిన ధర్మారెడ్డి జేఈవో బాధ్యతలను కూడా నిర్వహిస్తారని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here