గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన కుమారస్వామి.. ఈ రోజే రాజీనామా?

0
44

  • చివరి అంకానికి చేరుకున్న కర్ణాటక రాజకీయం
  • అత్యవసర కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్న కుమారస్వామి
  • అనంతరం రాజీనామా చేయనున్న స్వామి

గత కొన్ని రోజులుగా ఉత్కంఠను రేపిన కర్ణాటక రాజకీయం చివరి అంకానికి చేరుకుంది. సంకీర్ణ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయింది. రెబెల్ ఎమ్మెల్యేలను సముదాయించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో… అసెంబ్లీ రద్దుకు ముఖ్యమంత్రి కుమారస్వామి సిఫారసు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు 11 గంటలకు కుమారస్వామి అత్యవసరంగా మంత్రిర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. కేబినెట్ మీటింగ్ అనంతరం గవర్నర్ ను కలిసి కుమారస్వామి రాజీనామా పత్రాన్ని అందిస్తారని సమాచారం

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here