చిన్నారులకు చదువు చెప్పాల్సిన చోట అక్రమ ఆయుధాలు.. ఆరుగురి అరెస్ట్

0
63

  • అసాంఘిక కార్యకలాపలకు కేంద్రాలుగా మదరసాలు
  • ఉత్తరప్రదేశ్ లోని మదరసాపై పోలీసుల దాడి
  • ఐదు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం

ముస్లిం విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన మదరసాలు అసాంఘిక కార్యకలాపాలకు స్థావరాలుగా మారుతున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్ లోని షేర్ కోట్ లో ఉన్న ఒ మదరసాపై దాడి చేసిన పోలీసులు, అక్కడ ఉంచిన అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మదరసాలో 25 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. మదరసాలో ఆయుధాలు ఉన్నట్టు పక్కా సమాచారం అందడంతో… పోలీసులు మెరపు దాడి చేశారు.

ఈ సందర్భంగా సర్కిల్ పోలీస్ ఆఫీసర్ కనోజియా మాట్లాడుతూ, కొందరు సంఘ విద్రోహ శక్తులు ఈ మదరసాకు వచ్చినట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు. మదరసాలో తాము తనికీలు చేపట్టి… ఐదు తుపాకులు, పెద్ద సంఖ్యలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here