ఇదేమైనా చేపల మార్కెటా?: టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం

0
69

  • ప్రజలు చూస్తున్నారని గమనించాలి
  • హుందాగా సభను నడిపించాలని భావిస్తున్నా
  • ప్రతి ఒక్కరూ సహకరించాలన్న స్పీకర్

తెలుగుదేశం సభ్యులు మాట్లాడుతున్న సమయంలో అధికారపక్షం మౌనంగా ఉందని, అధికారపక్షం మాట్లాడుతుంటే మాత్రం విపక్ష ఎమ్మెల్యేలు గొడవ చేస్తున్నారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనాన్ని వ్యక్తం చేశారు. సభ ఆర్డర్ తప్పుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదేమీ ఫిష్ మార్కెట్ కాదని, ప్రజలు చూస్తున్నారని గమనించాలని హితవు పలికారు.

ముఖ్యమంత్రి, విపక్ష నేత మాట్లాడేవేళ, వారికి ఎవరూ అడ్డుతగల వద్దని కోరారు. సభను తాను హుందాగా నడిపించాలని కోరుకుంటున్నానని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తమ్మినేని వ్యాఖ్యానించారు. అంతకుముందు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్ మాట్లాడితే, ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందన్న భయంతోనే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యులు కంట్రోల్ తప్పరాదని, వారు హద్దులు దాటితే మాత్రం చూస్తూ ఊరుకోబోయేది లేదని అన్నారు

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here