మహిళా ఎంపీలను ఇంటికి పిలిచి, అల్పాహార విందు ఇచ్చిన నరేంద్ర మోదీ

0
66

  • ఎంపీలు, ప్రభుత్వం మధ్య సమన్వయం పెరిగేందుకే
  • ఐదోసారి ఎంపీలతో సమావేశమైన మోదీ
  • మరో రెండు సమావేశాలుంటాయన్న బీజేపీ

మహిళా ఎంపీలను తన నివాసానికి ఆహ్వానించి ప్రధాని నరేంద్ర మోదీ, వారికి అల్పాహార విందు ఇచ్చారు. న్యూఢిల్లీలోని మోదీ అధికారిక నివాసం ఇందుకు వేదికగా మారింది. ఎంపీలు, ప్రభుత్వానికి మధ్య పరస్పర సహకారాన్ని పెంచేందుకే ఈ తరహా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఎంపీలు, ప్రధాని మోదీ మధ్య ఈ తరహా సమావేశం జరగడం ఈ మధ్య కాలంలో ఇది ఐదోసారి కావడం గమనార్హం. మరో రెండు సమావేశాలు కూడా ఉంటాయని పార్టీ నేతలు అంటున్నారు. తొలుత ఓబీసీ ఎంపీలతో, ఆపై ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఎంపీలతో మోదీ సమావేశం అయ్యారన్న సంగతి తెలిసిందే. ఆ వరుస క్రమంలోనే నేడు మహిళా ఎంపీలతో మోదీ సమావేశమై, పలు అంశాలు, సమస్యలపై చర్చించి, ఎంపీల నుంచి సలహాలు తీసుకున్నారు

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here