రూ. 200 అప్పును తిరిగి చెల్లించేందుకు 22 ఏళ్ల తరువాత ఇండియా వచ్చిన కెన్యా ఎంపీ!

0
64

  • 1985లో ఇండియాలో చదువుకున్న టోంగీ
  • చిరు వ్యాపారి వద్ద ఆహారం కోసం అప్పు
  • ఇంతకాలానికి తిరిగి ఇచ్చేందుకు ఇండియాకు రాక

తాను 22 సంవత్సరాల క్రితం ఇండియాలోని ఓ చిరు వ్యాపారికి బకాయి పడ్డ రూ. 200ను తిరిగి ఇచ్చేందుకు కెన్యాకు చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు మహారాష్ట్రలోని ఔరంగా బాద్ కు వచ్చారు. కెన్యాలోని న్యారిబారీ చాచే నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న రిచర్డ్ నయాగకా టోంగీ తన ఇంటికి వచ్చేవరకు ఆ వ్యాపారి కాశీనాథ్ గావ్లీ ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. తాము 1985 నుంచి 89 మధ్య కాలంలో మౌలానా ఆజాద్ కాలేజీలో మేనేజ్ మెంట్ విద్యను అభ్యసించానని, ఆ సమయంలో కాశీనాథ్ దుకాణంలో సరుకులు తీసుకునేదాన్నని టోంగీ వెల్లడించారు. ఆ సమయంలో ఆయనకు చెల్లించాల్సిన రూ. 200 చెల్లించకుండానే కెన్యాకు తిరిగి వెళ్లిపోయానని, ఆపై తనకు వివాహమైందని, ఎప్పటికైనా ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సిందేనని భావించానని ఆమె అన్నారు. ఇంతకాలానికి తన భార్యతో కలిసి ఇండియాకు వచ్చానని, బకాయి పడ్డ డబ్బు ఇచ్చానని, తన మనసు ఎంతో ప్రశాంతంగా ఉందని తనను కలిసిన మీడియాకు టాంగీ వివరించారు. ఇది తనకు ఓ భావోద్వేగపూరితమైన పర్యటనని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. గావ్లీ, అతని బిడ్డలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆపై ఔరంగాబాద్ లో తాను చదివిన కాలేజీకి వెళ్లి, అక్కడి విద్యార్థులను కలిసి ముచ్చటించారు

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here