టీమ్ నరేంద్ర మోదీ తరపున సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్న ధోనీ: బీజేపీ

0
61

  • రిటైర్మెంట్ తర్వాత ధోనీ రాజకీయాల్లోకి వస్తాడు
  • ధోనీ రిటైర్మెంట్ తర్వాత నిర్ణయం ఉంటుంది
  • కీలక వ్యాఖ్యలు చేసిన సంజయ్ పాశ్వాన్

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొందరు చెబుతుండగా… ఆయన మరింత కాలం ఆడాలని మరి కొందరు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత సంజయ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ధోనీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడని ఆయన అన్నారు. ఇంత వరకు టీమిండియాకు ఆడిన ధోనీ… ఇకపై టీమ్ నరేంద్ర మోదీ తరపున సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతాడని చెప్పారు. ధోనీ రాజకీయ ప్రవేశంపై చాలా కాలంగా చర్చ జరుగుతోందని తెలిపారు. అయితే, ఏ నిర్ణయమైనా ధోనీ రిటైర్మెంట్ తర్వాతే ఉంటుందని చెప్పారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here