తైవాన్ విషయంలో మీ బోడి పెత్తనమేంటి?: అమెరికాను హెచ్చరించిన చైనా

0
67

  • తైవాన్‌కు ఆయుధాలు విక్రయించాలని అమెరికా నిర్ణయం
  • కొత్త సమస్యలు సృష్టించడం మానుకోవాలన్న చైనా
  • పునరేకీకరణను ఏ శక్తీ అడ్డుకోలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు

తైవాన్‌కు ఆయుధాలు విక్రయించేందుకు సిద్ధమైన అమెరికాకు చైనా హెచ్చరికలు జారీ చేసింది. నిప్పుతో చెలగాటం ఆడొద్దని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తై‌వాన్‌కు 2.2 బిలియన్ డాలర్ల విలువైన యుద్ధ సామగ్రిని విక్రయించాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. అగ్రరాజ్య నిర్ణయంపై మండిపడిన చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా-చైనా బంధానికి కొత్త సమస్యలు సృష్టించడం మానుకోవాలని హితవు పలికింది.

హంగేరీ పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ మాట్లాడుతూ.. తైవాన్ విషయంలో అమెరికా జోక్యం తగదని పేర్కొన్నారు. పునరేకీకరణను ఏ శక్తీ అడ్డుకోలేదంటూ పరోక్షంగా తైవాన్‌ను ఉద్దేశించి అన్నారు. కొత్త సమస్యలు సృష్టించాలని చూస్తే అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాంగ్ హెచ్చరికలు జారీ చేశారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here