భారత జట్టుకు దొరకని విమాన టికెట్లు.. ఫైనల్ ముగిసే వరకు ఇంగ్లండ్‌లోనే!

0
76

  • వెంటనే టికెట్లు తీసుకోవడంలో మేనేజ్‌మెంట్ విఫలం
  • టికెట్లు దొరికిన వెంటనే బృందాలుగా స్వదేశానికి చేరుకుంటారని ప్రకటన
  • ఆగస్టులో విండీస్ టూర్‌కు భారత జట్టు

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో ఓటమితో ప్రపంచకప్‌లో టీమిండియా ప్రస్థానం ముగిసింది. ఆ వెంటనే భారత జట్టు స్వదేశానికి పయనం కావాల్సి ఉండగా టికెట్లు లేక భారత జట్టు లండన్‌లో ఉండిపోయింది. ఈ నెల 14 వరకు అంటే.. రేపటి వరకు టీమిండియా ఇంగ్లండ్‌లోనే ఉండనుంది. స్వదేశానికి వచ్చేందుకు మేనేజ్‌మెంట్ వెంటనే టికెట్లు తీసుకోవడంలో విఫలమైంది. దీంతో నాలుగు రోజులపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. టికెట్లు దొరికిన వెంటనే జట్టు సభ్యులు బ్యాచ్‌లుగా స్వదేశానికి చేరుకుంటారని టీం మేనేజ్‌మెంట్ తెలిపింది.

కాగా, ఈ ఆగస్టులో భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రాతోపాటు మరికొందరు యువ ఆటగాళ్లకు ఈ టూర్‌లో విశ్రాంతి ఇవ్వనున్నారు. అయితే, విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీని ఈ టోర్నీకి ఎంపిక చేస్తారా? లేదా? అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here