అనంతపురంలో దారుణం.. గొంతుకోసి ముగ్గురి దారుణ హత్య

0
49

  • తనకల్లు మండలం కొర్తికోటలో ఘటన
  • స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిన హత్యలు
  • దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న పోలీసులు

అనంతపురం జిల్లాలో ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. తనకల్లు మండలం కొర్తికోటలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉన్నాడు. వీరిని  హనుమమ్మ, సత్యలక్ష్మి, శివరామిరెడ్డిగా గుర్తించారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. దర్యాప్తు అనంతరం అన్ని విషయాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here