జగన్ విద్యుత్ కంపెనీలు బాగుండాలి… ఇతర కంపెనీలు మునిగిపోవాలి: చంద్రబాబు

0
31

  • విద్యుత్ ఒప్పందాలపై పెట్టుబడిదారులను భయపెడుతున్నారు
  • రాష్ట్రంలో కంపెనీలు మూతపడే పరిస్థితి తీసుకొస్తున్నారు
  • అన్ని సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు కురిపించారు. ఏపీలో సోలార్, పవన విద్యుత్ సంస్థల ఒప్పందాలపై సమీక్ష నిర్వహిస్తామంటూ పెట్టుబడిదారులను భయపెడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించవద్దని చెబుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇదే రీతిలో ముందుకు వెళ్తే, రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రావని చెప్పారు. తన సొంత విద్యుత్ కంపెనీలకు మాత్రం నష్టం రాకుండా జగన్ చూసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇతర కంపెనీలు మాత్రం నష్టాల్లో మునిగిపోవాలనేది ఆయన దురాలోచన అని అన్నారు. రాష్ట్రంలోని కంపెనీలన్నీ మూతపడే పరిస్థితిని తీసుకొస్తున్నారని విమర్శించారు. అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here