విశాఖ పోలీసులకు ‘టిక్ టాక్’ పిచ్చి.. డ్యూటీలో ఉంటూనే కుప్పిగంతులు, ఎంజాయ్

0
25

  • టిక్ టాక్ వీడియోలు చేస్తున్న పోలీసులు
  • అధికారుల తీరుపై మండిపడుతున్న నెటిజన్లు
  • స్పందించని ఉన్నతాధికారులు, ప్రభుత్వం

ప్రస్తుతం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ టిక్ టాక్ యాప్ ను వాడేస్తున్నారు. విధి నిర్వహణ సందర్భంగా టిక్ టాక్ వీడియోలు చేయడంతో గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు ఫిజియోథెరపి సిబ్బందిని యాజమాన్యం ఇంటికి సాగనంపింది. తాజాగా విశాఖపట్నం పోలీసులకు ఈ టిక్ టాక్ పిచ్చి పట్టుకుంది. విధి నిర్వహణ మానేసిన పోలీసులు.. టిక్ టాక్ వీడియోలతో ఎంజాయ్ చేస్తున్నారు. అరకు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగరాజుతో పాటు, విశాఖలో మహిళల రక్షణకు ఏర్పాటు చేసిన శక్తి టీమ్ సిబ్బంది ఈ టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారు.

శక్తి టీమ్ కారులోనే తమలోని కళా నైపుణ్యాలను బయటపెడుతూ వీడియోలు రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు పోలీసులపై దుమ్మెత్తిపోస్తున్నారు.  విధినిర్వహణ సమయంలో పోలీసులు ఇలా టిక్ టాక్ వీడియోలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంపై ఇటు జిల్లా పోలీసులు, అటు ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here