మరోసారి పాండ్యా మాజీ ప్రేయసి అన్నారో…: ఊర్వశీ రౌతెలా వార్నింగ్!

0
66

  • పాండ్యాను ఊర్వశి సాయం కోరినట్టు వార్తలు
  • పిచ్చి వార్తలని మండిపడ్డ ఊర్వశి
  • కుటుంబాల్లో చిచ్చు పెట్టవద్దని వినతి

బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతెలా, ఇప్పుడు మీడియాపై విరుచుకు పడుతోంది. గతంలో చానాళ్ల పాటు క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కలిసి చెట్టాపట్టాలేసుకు తిరిగిన ఈ అమ్మడు, ఆపై పాండ్యాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె ఓ విషయంలో పాండ్యా సాయం కోరినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇదే విషయమై,  ఓ హిందీ వార్తా పత్రిక వార్తను అందిస్తూ, హార్దిక్‌ పాండ్యా మాజీ ప్రేయశి ఊర్వశి అంటూ… కథనాన్ని అందించింది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

దీన్ని గురించి తెలుసుకున్న ఊర్వశి, అగ్గిమీద గుగ్గిలమయింది. ఇవన్నీ పిచ్చి వార్తలని మండిపడింది. మీడియా ఇలాంటి వార్తలను ప్రచురించొద్దని కోరింది. మీ వార్తలతో కుటుంబ కలహాలు వస్తున్నాయని, భవిష్యత్తులో ఏదన్నా జరిగితే తన కుటుంబానికి జవాబు చెప్పుకోలేనని వాపోయింది. కాగా, పాండ్యా, ఊర్వశీలు కలిసి ఎన్నో పార్టీలకు జంటగా వెళ్లిన సంగతి తెలిసిందే. దాంతో వారిద్దరూ డేటింగ్‌ లో ఉన్నారని, పెళ్లికి సిద్ధమవుతున్నారని కూడా వార్తలు వచ్చాయి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here