మే 2న పెళ్లి, ఇప్పుడు మూడు నెలల గర్భం… భార్యను చంపేసిన భర్త!

0
20

  • కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘటన
  • భార్యను హత్య చేసి ఆత్మహత్యాయత్నం
  • కేసును దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

పెళ్లయి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు, మూడు నెలల గర్భం తన భార్యకు ఉందని తెలుసుకున్న ఓ భర్త, కర్కశంగా ఆమెను చంపేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, పట్టణంలో బీరువాలు తయారు చేసే కార్మికుడు మహబూబ్ కు, ఆదోని మండలానికి చెందిన రజియాబానుకు ఈ సంవత్సరం మే 2న వివాహం జరిగింది. ఇటీవల భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా, గర్భం దాల్చిన విషయం బయటకు వచ్చింది. దీంతో అనుమానం పెంచుకున్న మహబూబ్, నిత్యమూ ఆమెను వేధించాడు. నిద్రిస్తున్న భార్య గొంతు నులిపి హత్య చేశాడు. ఆపై తన ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, మహబూబ్ ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. రజియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని వెల్లడించారు

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here