డోంట్ వర్రీ.. నా చలానాలన్నీ కట్టేశా: సినీ నటుడు రాజశేఖర్

0
67

  • రాజశేఖర్ వాహనంపై రూ. 18 వేల పెండింగ్ చలానాలు
  • ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఓ మహిళ
  • తప్పు చేసిన వారెవరైనా ఫ్రీగా తిరగలేరన్న రాజశేఖర్

టాలీవుడ్ హీరో రాజశేఖర్ తన వాహనానికి సంబంధించి రూ. 18వేల చలానాలను కట్టలేదంటూ ఓ ఆంగ్ల పత్రికలో కథనం వచ్చింది. ఈ వార్తను ఓ మహిళ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. రూ. 18వేల చలానాలు పెండింగ్ లో ఉన్నా యాక్టర్ రాజశేఖర్ ఫ్రీగా తిరుగుతున్నారని… దీనిపై ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఓవర్ స్పీడ్ తో వెళ్తూ ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తున్నారని ఆమె విమర్శించారు.

దీనిపై రాజశేఖర్ స్పందిస్తూ, ‘డోంట్ వర్రీ. నేను ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించలేదు. చలానాలన్నీ కట్టేశాను’ అని ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న చలానాలన్నీ కట్టేశానని… భవిష్యత్తులో కూడా తన చలానాలేవీ పెండింగ్ లో ఉండవని చెప్పారు. తప్పు చేసిన వారెవరైనా ఫ్రీగా తిరగలేరని తెలిపారు. చలానాలు కట్టేందుకు తాను నిరాకరించలేదని… చలానాలు కట్టాలనే విషయాన్ని కూడా మర్చిపోలేదని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు ఈ విషయంపై స్పందించలేదంటే… తాము చర్చలు జరుపుతున్నామని దాని అర్థమని అన్నారు

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here