దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పబోయి అభాసుపాలైన ఐసీసీ

0
71

  • ఆండ్రూ హాల్ ఫొటోకు బదులుగా బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్ ఫొటో
  • తప్పును ఐసీసీ దృష్టికి తీసుకెళ్లిన నెటిజన్లు
  •  ఫొటో చూసి అతడు మా బౌలింగ్ కోచ్ అన్న బంగ్లాదేశ్

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఆండ్రూహాల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో ఐసీసీ తప్పులో కాలేసింది. శుభాకాంక్షలు సరిగానే చెప్పినా ఆండ్రూహాల్ ఫొటోకు బదులు బంగ్లాదేశ్‌ బౌలింగ్‌కోచ్‌ చార్ల్‌ లాంగ్‌వెల్ట్‌ ఫొటోను పోస్టు చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఐసీసీని ట్రోల్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీ ట్వీట్‌పై స్పందించింది. అతడు తమ బౌలింగ్ కోచ్ అని గుర్తు చేసింది.

44వ బర్త్ డే జరుపుకుంటున్న ఆండ్రూహాల్‌కు ఐసీసీ విషెస్ చెబుతూ.. ‘‘దక్షిణాఫ్రికా అత్యుత్తమ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన ఆండ్రూహాల్‌కి హ్యాపీ బర్త్ డే. సౌతాఫ్రికా తరపున 111 మ్యాచుల్లో 143 వికెట్లు తీసిన హాల్ 1600 పరుగులు చేశాడు’’ అని ట్వీట్ చేసి లాంగ్‌వెల్ట్ ఫొటో పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు అది హాల్ ఫొటో కాదని ఐసీసీకి గుర్తు చేశారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here