వెన్నులో వణుకు పుడుతుందా ఉమా?: విజయసాయి రెడ్డి

0
32

  • రివర్స్ టెండరింగ్ పేరు చెబితేనే భయం
  • జగన్ కు కుల బలహీనతలు లేవు
  • ప్రతి రూపాయినీ కక్కిస్తామన్న వైసీపీ ఎంపీ

పలు ప్రాజెక్టు పనుల రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి వెన్నులో వణుకు పుడుతోందా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి కుల బలహీనతలు లేవని, అవి ఉన్నది చంద్రబాబుకేనని సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “ప్రాజెక్టుల పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే మీకు, మీ అధినేతకు వెన్నులో వణుకు పుడుతుందా ఉమా? పోలవరంలో మీరు దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తాం. మీలాగా కుల, వర్గ బలహీనతలు సీఎం జగన్ గారికి లేవు. చూస్తారుగా తొందరెందుకు?” అని అన్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here