ఒక్క చలాన్ కూడాలేని బండిని ఆపి, సినిమా టికెట్లు, గులాబీ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు… వీడియో ఇదిగో!

0
32

  • హైదరాబాద్ లో వాహనదారులకు అవగాహన
  • స్వయంగా నిబంధనలు వివరించిన అంజనీ కుమార్
  • వైరల్ అవుతున్న వీడియో

అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడిపించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో, హైదరాబాద్ పోలీసులు వినూత్న అవగాహనా ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా, వాహనాలను తనిఖీలు చేస్తున్న సమయంలో, వారు అన్ని నిబంధనలూ పాటిస్తున్నారని, అన్ని రకాల వాహన పత్రాలున్నాయని తెలిస్తే, వారికి సినిమా టికెట్లను, గులాబీ పువ్వులను ఇచ్చి అభినందిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోను హైదరాబాద్ సిటీ పోలీసులు తమ అధికారికి ఫేస్ బుక్ ఖాతాలో పంచుకుంది. ఇందులో ట్రాఫిక్ రూల్స్ గురించి వాహన దారుడికి హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్వయంగా వెల్లడిస్తూ కనిపిస్తున్నారు. అదిప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని మీరూ చూడండి.

Felicitation To Commuters by Sri Anjani Kumar,IPS, Commissioner Of Police Hyderabad City.

Felicitation To Commuters For Following Traffic Rules,Sri Anjani Kumar,IPS, Commissioner Of Police Hyderabad City.

Hyderabad City Police ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಸೋಮವಾರ, ಜುಲೈ 29, 2019

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here