కడప జిల్లాలో ‘ఎర్ర చందనం’ దొంగలు

0
17

  • దుంగలు తరలిస్తుండగా మొరాయించిన నాలుగు చక్రాల ఆటో
  • సరుకుతోపాటు వాహనాన్ని వదిలి పరారైన దుండగులు
  • పది దుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

కడప జిల్లాలో ఎర్రదొంగల సంచారం బయటపడింది. జిల్లాలోని కసలపాడు మండలం ముసలరెడ్డిపల్లి వద్ద నాలుగు చక్రాల ఆటోలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను ఈరోజు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే…గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో చందనం దుంగలు వేసుకుని బయలుదేరారు. ఆటో ముసలరెడ్డిపల్లి వద్దకు వచ్చేసరికి మొరాయించింది. ఎంతకీ స్టార్ట్‌కాకపోవడంతో భయపడిన దుండగులు దుంగలతో ఉన్న ఆటోను అక్కడే వదిలేసి పరారయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐ ప్రదీప్‌నాయుడు ఘటనా స్థలికి చేరుకుని వాహనాన్ని, దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here