భూషణ్ జీ.. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉల్లాసంగా ఉండాలని ప్రార్థిస్తున్నా!: చంద్రబాబు నాయుడు

0
21

  • నేడు ఏపీ గవర్నర్ పుట్టినరోజు
  • ట్విట్టర్ లో జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు
  • గత నెల 16న ఏపీకి గవర్నర్ గా వచ్చిన హరిచందన్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుట్టినరోజు నేడు.  ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ..‘గౌరవనీయులు, రాష్ట్ర గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

పూర్ణాయుష్కులై, సంపూర్ణ ఆరోగ్యంతో, ఉల్లాసవంతమైన జీవితం మీ సొంతం కావాలనీ, మీరు సదా సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని తెలిపారు. ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేత బిశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ గవర్నర్ గా గత నెల 16న కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here