హైదరాబాద్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం.. 15 మందికి గాయాలు!

0
66

  • నగరంలోని బహదూర్ పురా వద్ద ఘటన
  • నియంత్రణ కోల్పోయి అదుపు తప్పిన బస్సు
  • ధ్వంసమైన బస్సు అద్దాలు.. పలువురికి గాయాలు

హైదరాబాద్ లోని బహదూర్ పురా వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ఇక్కడి నెహ్రూ జువాలజికల్ పార్కు సమీపంలో పల్టీ కొట్టింది. దీంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా నుంచి హైదరాబాద్ కు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. ఈరోజు హైదరాబాద్ లోని బహదూర్ పురా ప్రాంతానికి రాగానే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో డివైడర్ ను ఢీకొట్టిన బస్సు పక్కకు పల్టీ కొట్టింది.

ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసం కాగా, వాహనంలోని 15 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు అయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రికి తరలించారు. మరోవైపు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని కొందరు ప్రయాణికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, డ్రైవర్ ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here