గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ‘దబాంగ్’ నటుడు.. ఖర్చులు భరించిన సల్మాన్ ఖాన్

0
69

  • రెండు నెలల క్రితం గుండెపోటుకు గురైన పాండే
  • సల్మాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నటుడు
  • దబాంగ్ సినిమాలో సల్మాన్‌తో కలిసి నటించిన పాండే

ఆపదలో ఉన్న వారికి సాయం చేయడంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ముందుంటాడు. తాజాగా, జూనియర్ ఆర్టిస్ట్, దబాంగ్ సినిమాలో తన సహనటుడు అయిన దాదీ పాండేకు సాయం చేసి తన పెద్ద మనసును చాటుకున్నాడు. రెండు నెలల క్రితం గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరిన పాండేకు సంబంధించిన ఆసుపత్రి బిల్లుల మొత్తాన్ని సల్మాన్ చెల్లించాడు. కోలుకుంటున్న పాండే తాజాగా సల్మాన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.

గుండెపోటుకు గురైన పాండేను తొలుత సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన సల్మాన్ వెంటనే వెళ్లి పరామర్శించి ఆసుపత్రి బిల్లులను తాను చెల్లిస్తానని మాటిచ్చి నిలబెట్టుకున్నాడు. దబాంగ్ సినిమాలో పోలీసు పాత్రలో నటించిన పాండే ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇంకా అతడికి పూర్తిస్థాయిలో విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.

తన ఆసుపత్రి ఖర్చులు సల్మాన్ భరించాడని తెలియగానే పాండే ఉద్వేగానికి లోనయ్యాడు. మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడాడు. అతడో గొప్ప వ్యక్తి అని ప్రశంసించాడు. తనకు సాయం చేసిన సల్మాన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. త్వరలోనే సల్మాన్‌ను కలుస్తానన్నాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here