జగన్, చంద్రబాబు, కేసీఆర్, మోహన్ బాబులను చూపిస్తూ… ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సాంగ్ విడుదల

0
15

  • తొలి సాంగ్ ను విడుదల చేసిన ఆర్జీవీ
  • జగన్, చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం
  • వైరల్ అవుతున్న వీడియో

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంలోని పాట నేడు విడుదల అయ్యింది. ఎప్పుడూ వివాదాస్పద మార్గంలోనే వెళ్లే వర్మ, ఈ దఫా కూడా అదే పంథాను ఎంచుకున్నాడు. సాంగ్ ప్రారంభంలోనే వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం, ఆపై అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని, చంద్రబాబు, జగన్ ల మధ్య వాగ్యుద్ధాన్ని చూపిస్తూ పాట మొదలైంది. చంద్రబాబు, జగన్ ల ఘాటు వ్యాఖ్యలను కూడా ఈ పాటలో చూపించడం గమనార్హం. ఇక ఇవే దృశ్యాలు రేపు సినిమాలో ఉంటాయో, ఉండవో చెప్పలేం గానీ, ప్రస్తుతానికి మాత్రం ఈ పాట నెట్టింట దూసుకెళుతోంది. నిమిషాల వ్యవధిలో వేల క్లిక్స్ వచ్చాయి. ఈ సాంగ్ ను మీరూ చూసేయండి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here