నేడు ప్రధాని మోదీని కలవనున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌

0
12

  • ఏపీలో తాజా పరిస్థితులు వివరించే అవకాశం
  • మధ్యాహ్నం అమిత్‌ షాతో భేటీ
  • సాయంత్రం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సమావేశం

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో భేటీకానున్నారు. నిన్న రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన గవర్నర్‌ ఈరోజు ప్రధానితోపాటు హోంమంత్రి అమిత్‌ షా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులను కలవనున్నారు. మోదీతో సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఆయనకు వివరిస్తారు. 12.20 గంటలకు అమిత్‌ షాతో భేటీ అవుతారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాలు, అధికార పక్షంపై విపక్ష టీడీపీ ఫిర్యాదులను ఆయన వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. సాయంత్రం 5.30 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సమావేశమవుతారు. శనివారం గవర్నర్ తిరిగి అమరావతి చేరుకుంటారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here