మా ‘పండు’ ఎక్కడ?… నాగ్ ను ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్!

0
76

  • తన వేలిపై ఉండే ‘పండు’ను మరచిపోయిన నాగార్జున!
  • బిగ్ బాస్ ప్రారంభం నుంచి నాగ్ తో కనిపించిన కోతిబొమ్మ
  • ఆదివారం నాటి ఎపిసోడ్ లో కనిపించని వైనం

టాలీవుడ్ రియాల్టీ షో బిగ్‌ బాస్‌ ప్రారంభం నుంచి, తన వేలిపై పండు ( అటూ ఇటూ తల తిప్పుతూ ముద్దగా మాట్లాడే కోతి బొమ్మ)ను తన మ్యానరిజంలో భాగంగా మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చిన నాగార్జున, నిన్నటి ఎపిసోడ్ లో దానిని పూర్తిగా మరచిపోయారు. తన వేలికి పండును తగిలించుకుని వచ్చే నాగ్, దాన్ని అటూ ఇటూ తిప్పుతూ, మాట్లాడుతూ, పలకరిస్తూ కామెడీని పండిస్తారన్న సంగతి తెలిసిందే.

అయితే, ఈ మూడు వారాల ఎపిసోడ్లలో ఆయన కొన్నిసార్లు పండును మరచిపోయినా, ఎపిసోడ్ లో ఎప్పుడో ఒకసారి కనిపిస్తూనే ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం అసలు కనిపించలేదు. ఈ విషయాన్ని గమనించిన నెటిజన్లు, పండు ఏమైందని కామెంట్లు పెడుతున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here