తనను నిలదీస్తారని ఫరూక్, మమతలకు దొరకని చంద్రబాబు: విజయసాయి రెడ్డి

0
43

  • తమను రెచ్చగొట్టి ఆపై వెనుకంజ వేస్తారా?
  • మమతా బెనర్జీ ప్రశ్నించాలని చూస్తున్నారన్న విజయసాయి
  • మాజీ మంత్రి లోకేశ్ పైనా విమర్శలు

తనను ఎక్కడ నిలదీస్తారోనని చంద్రబాబునాయుడు జాతీయ నేతలకు అందుబాటులో లేకుండా పోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ, “మోదీని గద్దె దింపేంత వరకు నిద్ర పోయేది లేదని దేశమంతా తిరిగి అందరినీ ఆగం పట్టించిన చంద్రబాబు కోసం ఫరూఖ్ అబ్దుల్లా, మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నిస్తే దొరకడం లేదట. అందరినీ రెచ్చగొట్టి తను మాత్రం 370 రద్దుకు మద్ధతు ఇవ్వడంపై నిలదీయాలనుకుంటున్నారట” అని అన్నారు.

అంతకుముందు, “మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి తనయుడైనా మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడు. మంగళగిరిలో 150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెల్లకే మర్చి పోతే ఎలా?” అని మరో ట్వీట్ పెట్టారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here