ముగ్గురు పాక్ సైనికులను కాల్చి చంపిన భారత్

0
78

  • నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు తెగబడుతున్న పాక్
  • ఉగ్రవాదులను కశ్మీర్ లోకి జొప్పించేందుకు కుతంత్రాలు
  • దీటుగా తిప్పిగొడుతున్న భారత జవాన్లు

భారత్-పాక్ జవాన్ల మధ్య చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో ముగ్గురు పాక్ రేంజర్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఉరీ, రాజౌరీ సెక్టార్ల వద్ద పాక్ జవాన్లు కాల్పుల ఉల్లంఘన ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఈ ఉదయం కాల్పులకు తెగబడ్డారు. భారత జవాన్లు కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించి, ముగ్గుర్ని హతమార్చారు. సరిహద్దుల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా పాకిస్థాన్ కాల్పులకు తెగబడుతోంది. ఈ క్రమంలో సరిహద్దుల వద్ద మాటు వేసిన ఉగ్రవాదులను కశ్మీర్ లోకి జొప్పించేందుకు యత్నిస్తోంది. అయితే, పాక్ చర్యలను భారత జవాన్లు దీటుగా ఎదుర్కొంటున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here