ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉద్ధృతి.. ఏ క్షణంలోనైనా కూలిపోనున్న రెయిలింగ్

0
121

  • 24, 39వ ఖానాల వద్ద దెబ్బతిన్న రెయిలింగ్
  • వాహనాలు వెళ్లకుండా నియంత్రణ
  • పోటెత్తుతున్న పర్యాటకులతో కొత్త తలనొప్పి

కృష్ణానది వరద ఉద్ధృతికి ప్రకాశం బ్యారేజీ పైన ఉన్న రెయిలింగ్ ఊగుతోంది. అది ఏ క్షణాన్నైనా కూలిపోయే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఆటోలు, కార్లను బ్యారేజీ వైపునకు వెళ్లకుండా నియంత్రించారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి శుక్రవారం ఒక్క రోజే  8.5లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఫలితంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నది ఉద్ధృతికి రెయిలింగ్ ఊగుతూ ప్రమాదకరంగా కనిపిస్తోంది.

24, 39వ ఖానాల వద్ద రెయిలింగ్ పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు అటువైపు వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పర్యాటకులను సైతం అటువైపు వెళ్లనివ్వడం లేదు. రెయిలింగ్ ప్రమాదకరంగా మారడంతో దానిని ఆనుకుని సెల్ఫీలు తీసుకునే వారు ఇబ్బందుల్లో పడతారనే ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో వారిని నియంత్రించడం పోలీసులకు తలనొప్పిగా మారింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here