రజనీకాంత్ రికార్డును బద్దలు కొట్టిన ప్రభాస్ ‘సాహో’

0
96

  • ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ‘సాహో’
  • రూ. 350 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ప్రభాస్ తాజా చిత్రం
  • పారిస్ లోని ‘లి గ్రాండ్ రెక్స్’ థియేటర్ లో విడుదలకానున్న ‘సాహో’

‘బాహుబలి’తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రిలీజ్ కావడానికి ముందే ఈ సినిమా రికార్డులను కొల్లగొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ చిత్రం రూ. 350 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి, అంచానలను మరింత పెంచేసింది.

మరోవైపు పారిస్ లోని ప్రతిష్ఠాత్మక థియేటర్ ‘లి గ్రాండ్ రెక్స్’లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ థియేటర్ యూరప్ లోనే అతి పెద్దది. ఈ థియేటర్ లో ఒకేసారి 2800 మంది సినిమాను వీక్షించవచ్చు. ఇప్పటి వరకు రజనీకాంత్ నటించిన ‘కబాలి’, విజయ్ నటించిన ‘మెర్సెల్’, ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ దక్షిణాది చిత్రాలు మాత్రమే ఈ థియేటర్ లో ప్రదర్శించబడ్డాయి. ఇప్పుడు ‘సాహో’ కూడా ఆ థియేటర్ లో ప్రదర్శించనుండటంతో… ఆ థియేటర్ లో రెండు సినిమాలను విడుదల చేసిన తొలి హీరోగా ప్రభాస్ రికార్టు పుటల్లోకి ఎక్కబోతున్నాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here