వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కేసులో అన్నీ అనుమానాలే కలుగుతున్నాయని అన్నారు. వివేకానందరెడ్డి మరణం వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించిందని చెప్పారు చంద్రబాబు. అయితే, ఆయన మరణం ఎంతో అనుమానాస్పదం కావడం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఆధారాలను తారుమారు చేయడానికి జరిగిన ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు. "సాధారణంగా ఎవరైనా చనిపోతే డెడ్...
వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి మృతి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. మొదట గుండెపోటుగా తెరపైకి వచ్చిన ఈ వ్యవహారం పోస్టుమార్టం తర్వాత హత్య అని తేలింది. అంతలోనే, వివేకా రాసినట్టుగా పేర్కొంటున్న ఓ లేఖ తెరపైకి వచ్చింది. దాన్ని తమకు అందించింది వివేకా కుటుంబ సభ్యులేనని చెబుతున్నారు కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. వివేకా హత్య గురించి మీడియాతో మాట్లాడుతూ, అన్ని కోణాల్లో దర్యాప్తు...
ఈ తెల్లవారుజామున పులివెందులలోని తన ఇంటి బాత్ రూమ్ లో వైఎస్ వివేకానందరెడ్డి విగతజీవిగా కనిపించగా, ఆయన మృతి వెనుక అనుమానాలు ఉన్నాయని వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. వివేకా మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని చెప్పిన ఆయన, తలకు, చేతికి బలమైన గాయాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న...
వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఈరోజు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కానీ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేటప్పటికే ఏటీఎం కేంద్రంలోని యంత్రాలు దగ్ధం అయ్యాయి. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. బ్యాంక్ పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పేలడంతోనే ఈ...
భాజపా, వైఎస్సర్సీపీల మధ్య రహస్య ఎన్నికల ఒప్పందం నిజమేనని వైకాపా విజయవాడ నగరశాఖ అధికార ప్రతినిధి మనోజ్‌ కొఠారి అంగీకరించారు. భాజపా పోటీ చేసే స్థానాల్లో తమ పార్టీ తరఫున బలహీన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. టైమ్స్‌ నౌ ఆంగ్ల ఛానల్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో కొఠారి తమ పార్టీ విధానాన్ని వెల్లడించారు. బుధవారం స్టింగ్‌ ఆపరేషన్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోలోని వివరాల...
చిత్తూరు జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. వడమాలపేట టోల్‌ప్లాజా వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో టాటా ఏస్‌ వాహనంలో తరలిస్తున్న రూ.1.09 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు కొన్ని క్రీడా సామగ్రిని కూడా సీజ్‌ చేశారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో ఈ నగదు పట్టుబడింది. తమిళనాడు నుంచి తిరుపతి తరలిస్తుండగా పోలీసులు వీటిని పట్టుకున్నారు.
విశాఖ నుంచి విజయవాడకు కారులో తరలిస్తున్న 30 కిలోల బంగారు బిస్కెట్లను పశ్చిమగోదావరి జిల్లా నారాయణపురం టోల్‌ప్లాజా వద్ద తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. ఈ బంగారు బిస్కెట్ల విలువ సుమారు రూ.10 కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ మీడియాకు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నామని.. ఇందులో...
ఏపీకి తొలి దశలోనే ఎన్నికలు నిర్వహించడం ద్వారా మనకు చెడు చేయాలని భావించారని, అయితే, తనకు మాత్రం ఆనందంగానే ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్రానికి ముఖ్యంగా తనకు ఓ మంచి అవకాశమని, ఎండలు పెరగకముందే ఎన్నికలు అయిపోతాయని, ఆపై ఎంతో స్వేచ్ఛగా ఉండవచ్చని, దేశమంతా తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని అన్నారు. తిరుమల వెంకటేశ్వరుని ఆశీర్వాదం తనపై ఎల్లప్పుడూ ఉంటుందని, 24 క్లెమోర్ మైన్స్...
  ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యాయి. అయితే, ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై భారీ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సస్పెన్స్ వీడింది. విశాఖ ఉత్తరం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారని టీడీపీ స్పష్టం చేసింది. విశాఖ జిల్లా...