ప్రస్తుత సమాజంలో ఎలాంటి సమాచారాన్ని అయినా వితిన్ నిమిషాల్లో  సామాజిక మాధ్యమాలల్లో ప్రత్యక్షమవుతాయి. అయితే ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీ వైసీపీ ముందుగానే పరిగణలోకి తీసుకోని తమ పార్టీ గురించి వాలంటీర్లు, కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో అధికార తెలుగు దేశం పార్టీ కూడా సామాజిక మాధ్యమాలల్లో తమ పార్టీ గురించి ప్రచారం చేస్తున్న వాలంటీర్లు, కార్యకర్తలకు నాయకత్వ కు సంబంధించి...
ఏపీ కి ప్రత్యేక హోదా అమలు కాంగ్రేస్ తోనేసాధ్యం:మస్తాన్ వలీ.  అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రేస్ పార్టీ అభయహస్తం ఇస్తోందని ఎపికి ప్రత్యేక హోదా అమలు ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమనీ ఏఐసీసీ కార్యదర్శి షేక్ మస్తాన్ వలీ అన్నారు.సోమవారం ఇంటిఇంటీకీ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ సెంటర్ నుండీ పాదయాత్ర గా ప్రతి ఇంటిని సందర్శించి  ముందస్తు హామీలకు సంబంధించిన కరపత్రాలను అందించారు ర్యాలీ కచేరి...
తీన్మార్ వార్తలంటే అందరికీ బిత్తిరి సత్తే గుర్తుకు వస్తాడు. కాగా, తాజాగా, ఆయనపై వీ6 ఆఫీసు ముందే దాడి జరిగింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ.. సత్తిపై దాడి చేసిన వ్యక్తిని చితకబాదారు. తెలంగాణ యాసతో, చక్కని సటైర్లతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటున్న బిత్తిరి సత్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయనను వెంటనే స్టార్ ఆస్పత్రికి తరలించారు. సత్తి తను పనిచేస్తున్న వీ6 టీవీ చానల్...
పెదవాల్తేరు (విశాఖతూర్పు) : రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకం దార్లకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) ద్వారా రూ.275కోట్ల మేర రుణాలు విడుదల చేసిందని గొర్రెలు–మేకల అభివృద్ధి సమాఖ్య రాష్ట్ర చైర్మన్‌ వై.నాగేశ్వరరావు వెల్లడించారు. నగరంలోని సమాఖ్య కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ 20 శాతం సబ్సిడీతో రుణాలు జిల్లా యూనియన్ల ద్వారా అందిస్తున్నట్టు చెప్పారు. లబ్ధిదారులు రుణాలపై పావలా వడ్డీ చెల్లించాల్సి...
  న్యూఢిల్లీ : ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై కోర్సు ప్రారంభించాలనే ప్రతిపాదనకు సహేతుక కారణం వెల్లడించాలని కోరుతూ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) రిజిస్ర్టార్‌కు ఢిల్లీ మైనారిటీ కమిషన్‌ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ప్రతిపాదిత కోర్సుపై వచ్చిన వార్తలపై సుమోటోగా మైనారిటీ కమిషన్‌ స్పందిస్తూ ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై ఏ ప్రాతిపదికన యూనివర్సిటీ కోర్సు ప్రారంభిస్తుందో వివరణ ఇవ్వాలని రిజిస్ర్టార్‌కు ఇచ్చిన నోటీసులో కమిషన్‌ పేర్కొంది. జేఎన్‌యూకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని...
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 294వ రోజు పాదయాత్ర గురువారం ఉదయం మక్కువ మండలంలోని చప్పబుచ్చమ్మపేట శివారు నుంచి ప్రారంభించారు.
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కలుసుకున్నారు. జననేతతో కలిసి పాదయాత్రలో పాల్గొని వైఎస్‌ జగన్‌కు మద్దతు తెలిపారు పోసాని. అంతకుముందు వైఎస్‌ జగన్‌ 172వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. శనివారం ఉదయం నైట్‌ క్యాంపు(ఆకివీడు) నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్‌ జగన్‌... కుప్పన పుడి, కోలనపల్లి  మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కాళ్ల చేరుకున్నాక విరామం...
పేదల బియ్యాన్ని స్వాహా చేయటంపై అధికారులకు ఫిర్యాదు చేసిందనే ఆగ్రహంతో అధికార పార్టీకి చెందిన రేషన్‌ డీలర్, అతడి సోదరులు ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గొల్ల లక్ష్మి అనే మహిళను దుర్భాషలాడారు. ఆమెపై భౌతిక దాడికి దిగి కొట్టటంతో జాకెట్‌ చిరిగిపోయింది. ట్రాక్టర్‌తో ఢీ కొట్టి చంపుతామంటూ బెదిరించారు. దాడితో అస్వస్థతకు గురైన...
కాలిబూడిదవుతున్న అటవీ ప్రాంతంవిలువైన కలప అగ్నికి ఆహుతిఘటనా స్థలి ప్రభుత్వ ఆధీన ప్రాంతం తిరుమల గిరులపై ఉన్న శేషాచలం కొండల్లో కార్చిచ్చు విస్తరిస్తోంది. ఎగసిపడుతున్న మంటలు శ్రీవారి పాదాల సమీపంలోకి వచ్చేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. భారీ ఎత్తున అటవీ ప్రాంతం తగలబడుతుండడంతో విలువైన వృక్షసంపద అగ్నికి ఆహుతి అవుతోంది. బాకరాపేట రేంజ్‌లోని చామలకోన అడవుల్లో...