చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చండీ హోమం, సుదర్శన హోమం, రుద్రాభిషేకం నిర్వహణ వేర్వేరు వాహనాల్లో వెళ్లిపోయిన తండ్రీకొడుకులు ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన కుమారుడు మోక్షజ్ఞలు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. ఇక్కడి పుల్లేటికుర్ర గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వీరిద్దరూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి నాగమల్లేశ్వర ఆధ్వర్యంలో స్వామి వారికి చండీ...
టీడీపీ మద్దతుదారుల ఇళ్లకు వెళ్లే దారిలో గోడ అడ్డుగా నిర్మించిన వైసీపీ నేతలు పరిశీలించేందుకు వెళ్లనున్న టీడీపీ కమిటీ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొనుగుపాడు గ్రామంలో పోలీసులు ఈరోజు 144 సెక్షన్ విధించారు. ఈ ఊరిలో టీడీపీ మద్దతుదారుల ఇంటికి వెళ్లే దారికి అడ్డంగా వైసీపీ నేతలు గోడ కట్టారన్న కథనాల నేపథ్యంలో అక్కడ పర్యటించేందుకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సిద్ధమయింది. ఈరోజు పొనుగుపాడుకు టీడీపీ...
విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద నిరసన 8 నెలల జీతాలు ఇవ్వలేదన్న ఉద్యోగులు న్యాయం చేయకుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని వార్నింగ్ పలు వివాదాలు రావడంతో టీడీపీ నేత కేశినేని నాని ‘కేశినేని ట్రావెల్స్’ వ్యాపారాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే తమకు వేతనాలు ఇవ్వకుండానే ఆయన కంపెనీని మూసేశారని ఉద్యోగులు అప్పట్లో ఆందోళన చేశారు. తాజాగా మరోసారి కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఈరోజు విజయవాడలోని లెనిన్...
పెద్ద మొత్తంలో మంజూరైన కొత్త సీట్లు ప్రస్తుత కౌన్సిలింగ్ లోనే సీట్ల భర్తీ వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 460 అదనపు ఎంబీబీఎస్‌ సీట్లు మంజూరయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో కొత్త సీట్లు రావడం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు. ఈ సీట్ల భర్తీ, ప్రస్తుతం జరుగుతున్న కౌన్సిలింగ్‌ నుంచే అమల్లోకి వస్తుందని రాష్ట్ర...
కేశినేని ట్రావెల్స్ లక్ష్యంగా విమర్శలు ఆయన కంటే కసాయివాడే బెటరని వ్యాఖ్య కార్మికులకు అన్యాయం చేసి అందలమెక్కారని ఆగ్రహం టీడీపీ నేత కేశినేని నాని, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ)ల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. తాజాగా కేశినేని నాని ట్రావెల్స్ వ్యాపారం లక్ష్యంగా పీవీపీ విమర్శలు గుప్పించారు. కసాయివాడికి గొర్రె మీ దఉన్న ప్రేమ కూడా తన దగ్గర పనిచేస్తున్న కార్మికులపై కేశినేనికి లేదని పీవీపీ దుయ్యబట్టారు. వేలాది...
నాలుగు రోజుల హైడ్రామా కిడ్నాపర్ల గురించి పెద్దగా సమాచారం ఇవ్వలేకపోయిన జషిత్ పట్టుకు తీరుతామన్న పోలీసులు ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర కలకలం రేపిన జషిత్‌ కిడ్నాప్ వ్యవహారం నాలుగు రోజుల హైడ్రామా అనంతరం సుఖాంతం కాగా, తన కిడ్నాప్ గురించి బాలుడు మాట్లాడాడు. తను నిన్న ఓ తాతయ్య దగ్గర ఉన్నానని, ఏదో ఊరిలో తనను ఉంచారని చెప్పాడు. ఆ ఊరి పేరును మాత్రం చెప్పలేదు. కిడ్నాపర్లలోని ఒకబ్బాయి...
నిన్న సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్ ఎత్తి వేయాలని టీడీపీ ధర్నా సమస్యలపై పోరాడితే సస్పెండ్ అన్యాయమన్న చంద్రబాబు నిన్న అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు తెలుగుదేశం సభ్యులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను తిరిగి అసెంబ్లీలోకి పిలవాలని, వారిపై ఉన్న సస్పెన్షన్ వేటును వెనక్కు తీసుకోవాలని ఈ ఉదయం అసెంబ్లీ ప్రధాన గేటు ముందు చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం సభ్యులు నిరసన వ్యక్తం...
నన్ను రాజీనామా చేయాలని సవాల్ చేస్తారా? సున్నా వడ్డీపై అన్ని వివరాలు సభ ముందు ఉంచుతాం సీఎం ఎందుకు అంత పరుషంగా మాట్లాడుతున్నారు తీవ్ర గందరగోళం మధ్య ఏపీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. సున్నా వడ్డీ అంశం చర్చ సందర్భంగా అరుపులు, కేకలతో సభ దద్దరిల్లుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సున్నా వడ్డీ పథకానికి గత టీడీపీ...
మహారాష్ట్రతో పాటు ఎగువన విస్తారంగా వర్షాలు 600 మీటర్ల మేర ప్రవహరిస్తున్న గోదారమ్మ 200 మీటర్ల వెడల్పున్న ప్రాంతం నుంచి కిందకు వరదనీరు మహారాష్ట్రతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నది ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద 600 మీటర్ల వెడల్పు మేరకు గోదావరి ప్రవహిస్తోంది. దీంతో వరద ప్రవాహానికి కాఫర్ డ్యామ్ వరకూ వెళ్లేందుకు నిర్మించిన అప్రోచ్ రోడ్డు...
మద్యం అమ్మకాల సమయాన్ని కుదించే యోచనలో ప్రభుత్వం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అమ్మకాలు మద్యం అమ్మకాలు భారీగా తగ్గుతాయనేది ప్రభుత్వ ఆలోచన ఐదేళ్లలో విడతలవారీగా మద్యపాన నిషేధాన్ని విధించే దిశగా ఏపీలోని జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, మందుబాబులకు షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం మద్యం అమ్మకాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల...