మరో 12 మందికి తీవ్రగాయాలు యూపీలోని సంభాల్ జిల్లాలో ఘటన ప్రమాదతీవ్రతకు నుజ్జునుజ్జయిన మినీ వ్యాను ఉత్తరప్రదేశ్ లో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని సంభాల్ జిల్లాలో పెళ్లికి వెళ్లి వస్తున్న ఓ మినీ వ్యాన్ సరుకులు తరలిస్తున్న ఓ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 12 మంది కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. వివాహానికి వెళ్లి...
24 గంటల్లోపే రెండో ఎన్‌కౌంటర్ అమరుడైన ఆర్మీ జవాను ఉగ్రవాదులు జైషే మహ్మద్ సంస్థకు చెందిన వారిగా గుర్తింపు జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఈ ఉదయం  జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ ఆర్మీ జవాను అమరుడయ్యాడు. హతమైన ఇద్దరు ఉగ్రవాదులు జైషే మహ్మద్ సంస్థకు చెందిన వారుగా ఆర్మీ పేర్కొంది. జిల్లాలోని బిజ్‌బెహరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా...
భారీ పెనాల్టీని విధించిన డీసీసీ వసూలు విషయంలో ట్రాయ్ సూచనలు తీసుకుంటామని వెల్లడి కావాలనే జియోకు సహకరించలేదని తేలడంతో జరిమానా రిలయన్స్‌ జియో నెట్‌ వర్క్‌ ను వినియోగిస్తున్న కస్టమర్లు చేసే కాల్స్‌ కు ఇంటర్‌ కనెక్షన్‌ పాయింట్లను సరిపడినంతగా సమకూర్చని కారణంగా ఎయిర్‌ టెల్, వొడాఫోన్‌ ఐడియా సంస్థలపై భారీ పెనాల్టీని విధిస్తున్నట్టు డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (డీసీసీ) తెలిపింది. రూ. 3,050 కోట్లను ఈ కంపెనీలపై...
తమిళనాడులో ఘటన శోభనం గదికి వెళ్లే సమయంలో లెక్కలు కోరిన తండ్రి ఆగ్రహంతో తలపై కొట్టిన కుమారుడు పెళ్లి జరిగిన తొలిరోజే, తనను పడకగదిలోకి వెళ్లనీయకుండా, పెళ్లికి వచ్చిన చదివింపుల వివరాలు చెప్పాలని డిమాండ్ చేసిన తండ్రిని, తీవ్ర ఆగ్రహంతో కడతేర్చాడో కుమారుడు. ఈ ఘటన తమిళనాడులోని అరియలూరు జిల్లా జయంకొండం సమీపంలోని ఆదిచ్చనల్లూరు గ్రామంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఈ ప్రాంతానికి చెందిన షణ్ముగం...
అవంతిపొరా ప్రాంతంలో ఎదురుకాల్పులు ఇద్దరు ఉగ్రవాదుల హతం ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో తుపాకులు గర్జించాయి. జిల్లాలోని అవంతిపొరా పరిధిలో ఉన్న బ్రాబందిన ప్రాంతంలో ఈరోజు జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే, ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతంలో ఆర్మీ జవాన్లు గాలింపు చేపట్టారు. జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో, జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ...
అనధికారిక వ్యాపారులపై కథనం కోసం వచ్చిన అమిత్ శర్మ అడ్డుకుని దారుణంగా కొట్టిన రైల్వే ఇన్‌స్పెక్టర్‌ రాకేశ్ విధుల నుంచి తొలగించిన ఉన్నతాధికారులు ఉత్తరప్రదేశ్‌ లో పాత్రికేయులపై ఆగడాలు ఆగడం లేదు. ఇప్పటికే పలువురు జర్నలిస్టులపై ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపగా, తాజాగా, మరో  దారుణ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో ప్రభుత్వ అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైలులో జరుగుతున్న అనధికారిక వ్యాపారులపై ఓ...
తమిళనాడులోని పెరంబూర్ లో ఘటన భార్య వ్యవహారశైలిపై భర్త ఆగ్రహం టిక్ టాక్ వీడియోలు ఆపేయాలని మందలింపు చైనాకు చెందిన వీడియో తయారీ యాప్ టిక్ టాక్ ను వాడుతూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడులోని పెరంబూర్ లో చోటుచేసుకుంది. పెరంబూర్ లో ఓ జంట నివాసం ఉంటోంది. ఈ క్రమంలో టిక్ టాక్ వాడుతున్న భార్యను భర్త మందలించాడు. వాటికి దూరంగా...
ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లాలో ఘటన ఆరు బయట నిద్రపోతుండగా దుశ్చర్య మృతుడిని సత్యనారాయణగా గుర్తించిన పోలీసులు ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లాలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని బాలుపల్లి గ్రామంలో సత్యనారాయణ(40) అనే వ్యక్తి ఇంటి బయట నిద్రపోయాడు. అయితే గుర్తుతెలియని దుండగులు ఆయన తలను నరికేశారు. అనంతరం దాన్ని పట్టుకెళ్లారు. ఉదయాన్నే ఈ దారుణాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి...
26 మందికి గాయాలు...పలువురికి తీవ్రగాయాలు పలువురి పరిస్థితి ఆందోళనకరం ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు ఆగివున్న లారీని బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ మహ్మద్‌తో సహా మొత్తం పదకొండు మంది దుర్మరణం చెందగా 26 మంది గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జార్ఖండ్‌ రాష్ట్రం హజారీబాగ్‌ చాపహరణ్‌ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికుల్లో చాలామంది బస్సులో చిక్కుకోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం, గాయపడడం...
ప్రాణాలు కోల్పోయిన మరో 9 మంది విదేశీయులు బస్సు అదుపు తప్పడంతో దుర్ఘటన సంఘటన సమయానికి బస్సులో 31 మంది ప్రయాణికులు దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది భారతీయులు సహా మొత్తం 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఒమన్‌ నుంచి దుబాయ్‌కి 31 మంది ప్రయాణికులతో వస్తున్న బస్సు మార్గమధ్యంలో ఓ మెట్రో స్టేషన్‌ వద్ద...