ఆదివారం జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పాలకవర్గ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 'మా' ఉపాధ్యక్షురాలిగా హేమ గెలుపొందింది. ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆమె విజయం సాధించింది. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. నలుగురు మగవాళ్లను ఓడించి తాను ఈ ఎన్నికల్లో గెలుపొందానని తెలిపింది. ఈ విజయాన్ని సినీ...
నువ్వా.. నేనా.. అంటు సాగిన మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా నరేశ్‌‌ విజయం సాధించారు. శివాజీ రాజాకు 199 ఓట్లు, నరేశ్‌కు 268ఓట్లు పోలయ్యాయి. 69 ఓట్ల ఆధిక్యంతో నరేశ్‌ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. జనరల్‌ సెక్రటరీగా జీవిత రాజశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్‌, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల, జాయింట్‌ సెక్రటరీగా గౌతమ్‌రాజు, శివబాలాజీ గెలుపొందారు. హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం...
గరుడవేగ సినిమా యాంగ్రీ హీరో  రాజశేఖర్ కు పూర్వ వైభవం తీసుకువచ్చిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే ఈ సినిమా తరువాత రాజశేఖర్‌ కెరీర్‌ మళ్లీ ఊపందుకుంది. అంతేకాదు గతంలో రాజశేఖర్‌ హీరోగా ప్రారంభమై ఆగిపోయిన సినిమాలకు కూడా ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. 2011లొ రాజశేఖర్‌ హీరోగా అర్జున సినిమాను ప్రారంభించారు. తరువాత ఏమైందో కాని ఈ సినిమా ఊసే లేదు. ఏళ్లు గడిచిపోయాయి. రాజశేఖర్ ఇతర చిత్రాలతో...
జబర్దస్త్ కార్యక్రమం లో రాఘవ ది ప్రత్యేక శైలి. జబర్దస్త్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒక్క ఎపిసోడ్ కూడా రాఘవ లేకుండా రాలేదు. సీరియల్ నటుడిగా చాలా మందికి రాఘవ తెలిసినా.. జబర్దస్త్ తో మంచి గుర్తింపు సాధించాడు. రాఘవకి నటి ఛార్మి అంటే చాలా ఇష్టమంటే. ఈ విషయాన్నీ అలీతో సరదాగా పంచుకున్నాడు రాఘవ.. "నేను చార్మీకి అభిమానిని .. గ్లామర్ పరంగా .. నటన పరంగా ఆమె...
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కోసం అంతా చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించడం .. ఆ తరువాత చోటుచేసుకున్న రాజకీయ .. నాటకీయ పరిణామాలను ఈ సినిమాలో వర్మ చూపించనున్నాడు. ఇంతవరకూ వర్మ వదిలిన పోస్టర్లు .. టీజర్లు .. ట్రైలర్లకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అసలు జరిగింది ఇది అంటూ ఆయన జనం దృష్టిని ఈ సినిమా...
మొదటి సినిమాతోనే పరిశ్రమలో సంచలనం సృష్టించిన దార్శనికుడు.. 90 శాతానికి పైగా విజయవంతమైన చిత్రాలను తీసిన ఘనుడు. వెండి తెరమీద పల్లె పచ్చదనానికి పట్టం కట్టి మా పల్లెలో గోపాలుడు అన్నా.. ఆధ్యాత్మిక చింతనలో అమ్మోరు ని కళ్లకు కట్టినా.. మనిషిలోని కనిపించని రాక్షసుడు ఉంటాడని ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య గా పరిచయం చేసినా.. రాజకీయ కుత్సితాల్ని20 వ శతాబ్దపు మొదటి అంకంలోనే భారత్ బంద్ అంటూ...
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన పలు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలనూ తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ కోడి రామకృష్ణ సినిమాలు రూపొందించారు. 2016లో...
అనుష్క సినిమా చేస్తోంది. అవును. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ఇపుడు ఓ సరికొత్త థ్రిల్లర్ సినిమాలో చేయడానికి జెండా ఊపింది. పాత్రలో కొత్తదనం ఉంటేనే సినిమాని ఒప్పుకునే అనుష్క ఇపుడు సినిమాకి ఓకే చెప్పిందని విన్న అభిమానులు సంతోషిస్తున్నారు. దర్శకుడు హేమంత్ మధుకర్ చెప్పిన కథకి అనుష్క ఫిదా అయిపోయి వెంటనే ఒప్పుకుందని తెలుస్తోంది. ఆ సినిమాకి సైలెన్స్ అనే పేరును కూడా పరిశీలిస్తున్నట్టు వార్తలు...
సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన ‘మహానటి’ చిత్రం కలెక్షన్స్ పరంగా పలు రికార్డులను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సౌత్ లో ఇప్పటి వరకు ఏ బయోపిక్ కూడా సాధించని భారీ వసూళ్లను మహానటి దక్కించుకుంది. ఇంకా పలు అవార్డులను మరియు రివార్డులను కూడా దక్కించుకున్న మహానటి తాజాగా మరో అరుదైన గౌరవంను దక్కించుకుంది.వచ్చే నెలలో గోవాలో జరుగబోతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్...
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్‌, తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు గ్యాప్‌ తీసుకున్నాడు. అ! సినిమాతో దర్శకుడు పరిచయం అయిన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో నెక్ట్స్‌ సినిమా చేయనున్నాడు రాజశేఖర్‌. కల్కి పేరుతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్‌ స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ...