సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పార్టీల్లోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల్లోని అసమ్మతి నేతలు సిట్టింగ్ అభ్యర్థులకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా సత్తెనపల్లి వైసీపీ నేత బత్తుల బ్రహ్మానందం రెడ్డి ఈరోజు పార్టీ అధినేత జగన్ ను కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబును పోటీకి దించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయనపై స్థానికంగా వ్యతిరేకత ఉందని అధిష్ఠానం...
గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం యోచిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు రంగంలో లేని పలువురు నేతల పేర్లపైనా కసరత్తు చేస్తున్నారు. దిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ నివాసంలో ఆయన, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోస్‌ రాజు, శ్రీనివాసన్‌ కృష్ణన్‌, సలీం అహ్మద్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభ్యర్థుల ఎంపికపై మంగళవారం...
భాజపా, వైఎస్సర్సీపీల మధ్య రహస్య ఎన్నికల ఒప్పందం నిజమేనని వైకాపా విజయవాడ నగరశాఖ అధికార ప్రతినిధి మనోజ్‌ కొఠారి అంగీకరించారు. భాజపా పోటీ చేసే స్థానాల్లో తమ పార్టీ తరఫున బలహీన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. టైమ్స్‌ నౌ ఆంగ్ల ఛానల్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో కొఠారి తమ పార్టీ విధానాన్ని వెల్లడించారు. బుధవారం స్టింగ్‌ ఆపరేషన్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోలోని వివరాల...
జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా బుధవారం అర్ధరాత్రి విడుదలైంది. 4 లోక్‌సభ స్థానాలకు, 32 శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. ఖరారు చేసిన అభ్యర్థుల్లో మాజీ మంత్రులు రావెల కిషోర్‌ బాబు, పసుపులేటి బాలరాజు, శాసనసభ మాజీ సభాపతి నాదెండ్ల మనోహర్‌, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌ తదితర ముఖ్యులున్నారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలకూ టికెట్లు ఇచ్చారు. తొలి...
  ఈ దఫా ఎమ్మెల్యేగా కాకుండా, ఎంపీగా పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించడంతో, అది ఇష్టంలేని మంత్రి గంటా శ్రీనివాసరావు, నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. తాను అమరావతికి వెళుతున్నానని చెప్పిన ఆయన, హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం. గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి స్థానం నుంచి లోకేశ్ పోటీ చేస్తారని ఓమారు, టీడీపీలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరితే, ఆయనకు ఆ స్థానం కేటాయిస్తారని...
  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించేందుకు వైసీపీ-టీఆర్ఎస్ చేతులు కలిపాయని అధికార టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు బలం చేకూర్చే ఘటన ఒకటి నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నేతలు వాడిన కార్లు తాజాగా నెల్లూరు జిల్లాకు చేరుకున్నాయి. వీటికి టీఆర్ఎస్ స్టిక్కర్లు తొలగించి వైసీపీ స్టిక్కర్లు, లోగోలు వేస్తున్నారు. అలాగే వాహనాలతో పాటు లోపల సీట్లపై ఉన్న టీఆర్ఎస్...
  తెలుగుదేశం పార్టీ రూపొందించిన మేనిఫెస్టో రేపు విడుదల కానుంది. ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. కాగా.. నేడు మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మేనిఫెస్టోకు కమిటీ తుది మెరుగులు దిద్దనుంది. అనంతరం దాన్ని రేపు చంద్రబాబు విడుదల చేయనున్నారు.
కాకినాడకు చెందిన తెదేపా ఎంపీ తోట నరసింహం దంపతులు వైకాపాలో చేరారు. ఆయనతో పాటు వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ), సినీ నటుడు రాజా రవీంద్ర కూడా వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. లోటస్‌ పాండ్‌లో జగన్‌ సమక్షంలో బుధవారం వారు పార్టీ కండువా కప్పుకున్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం వైకాపాలో చేరుతున్నట్లు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తన భార్య వాణికి అడగ్గానే పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు వైకాపా అవకాశం ఇచ్చిందని...