హోమ్ ఎలక్షణం 2019 నువ్వా..నేనా..? (ఏపీ)

నువ్వా..నేనా..? (ఏపీ)

ap elections news, reviews, analysis, stories

జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా బుధవారం అర్ధరాత్రి విడుదలైంది. 4 లోక్‌సభ స్థానాలకు, 32 శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. ఖరారు చేసిన అభ్యర్థుల్లో మాజీ మంత్రులు రావెల కిషోర్‌ బాబు, పసుపులేటి బాలరాజు, శాసనసభ మాజీ సభాపతి నాదెండ్ల మనోహర్‌, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌ తదితర ముఖ్యులున్నారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలకూ టికెట్లు ఇచ్చారు. తొలి...
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితా విడుదల వాయిదాపై పార్టీ అధినేత జగన్‌ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు ఆయన పార్టీ ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శిల్పామోహన్‌రెడ్డి, బైరెడ్డి సిద్ధార్ణరెడ్డి తదితరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయని, ఇంకా పార్టీలోకి వచ్చే వారు ఉన్నారని వివరించారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే జాబితాను...
  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించేందుకు వైసీపీ-టీఆర్ఎస్ చేతులు కలిపాయని అధికార టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు బలం చేకూర్చే ఘటన ఒకటి నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నేతలు వాడిన కార్లు తాజాగా నెల్లూరు జిల్లాకు చేరుకున్నాయి. వీటికి టీఆర్ఎస్ స్టిక్కర్లు తొలగించి వైసీపీ స్టిక్కర్లు, లోగోలు వేస్తున్నారు. అలాగే వాహనాలతో పాటు లోపల సీట్లపై ఉన్న టీఆర్ఎస్...
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పార్టీల్లోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల్లోని అసమ్మతి నేతలు సిట్టింగ్ అభ్యర్థులకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా సత్తెనపల్లి వైసీపీ నేత బత్తుల బ్రహ్మానందం రెడ్డి ఈరోజు పార్టీ అధినేత జగన్ ను కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబును పోటీకి దించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయనపై స్థానికంగా వ్యతిరేకత ఉందని అధిష్ఠానం...
భాజపా, వైఎస్సర్సీపీల మధ్య రహస్య ఎన్నికల ఒప్పందం నిజమేనని వైకాపా విజయవాడ నగరశాఖ అధికార ప్రతినిధి మనోజ్‌ కొఠారి అంగీకరించారు. భాజపా పోటీ చేసే స్థానాల్లో తమ పార్టీ తరఫున బలహీన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. టైమ్స్‌ నౌ ఆంగ్ల ఛానల్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో కొఠారి తమ పార్టీ విధానాన్ని వెల్లడించారు. బుధవారం స్టింగ్‌ ఆపరేషన్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోలోని వివరాల...