వాగులు, నదులు కొల్లగొడుతున్నారు గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలి ప్రతి జిల్లాల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి ఏపీ సీఎం చంద్రబాబుపై, టీడీపీ నేతలపై ఏదో ఒక విమర్శ, ఆరోపణ చేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు ఓ ట్వీట్ చేశారు. ఏపీలో ఇసుక మాఫియా విజృంభిస్తోందని ఆరోపించారు. మరో వారం రోజుల్లో చంద్రబాబు మాజీ సీఎం అయిపోతాడని అర్థంకావడంతో, పచ్చ చొక్కాల ఇసుక మాఫియా విజృంభిస్తోందని...
చించోళి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం ‌ చించోళి, కలబురగి జిల్లాల్లో అత్యధికంగా తెలంగాణ వాసులు ఉపాధి వెతుక్కుంటూ వలస వెళ్లిన వారే అధికం కర్ణాటకలోని చించోళి అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు అక్కడి బీజేపీ అభ్యర్థి తరపున తెలుగు సినీ హాస్య నటుడు బాబూమోహన్‌ బుధవారం ప్రచారం చేశారు. బీదర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చించోళి అసెంబ్లీ...
ఈరోజు ప్రచారం ముగుస్తుండడంతో హోరాహోరీ ఆధిపత్యం కోసం బీజేపీ, తృణమూల్‌ ప్రయత్నం నేడు రాత్రి పది గంటలతో ప్రచార హోరుకు తెర పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో హోరాహోరీగా తలపడుతున్న అధికార తృణమూల్‌, బీజేపీలు ఎన్నిక ప్రచారానికి చివరి రోజు అదే స్థాయిలో పోటీపడుతున్నాయి. ప్రచారంలో భాగంగా బెంగాల్‌లో హింస చెలరేగడం, రాజకీయ పార్టీల పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ ప్రచారాన్ని ఒక రోజు ముందుగానే ముగించాలని...
మోదీ మలినమైన నోరున్న ప్రధాని అన్న అయ్యర్ అయ్యర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన జీవీఎల్ గతంలో చేసిన నీచ్ వ్యాఖ్యల ప్రస్తావన ప్రధాని మోదీని అత్యంత మలినమైన నోరున్న ప్రధాని అని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్  అనడంపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. 2017లో ప్రధాని మోదీని నీచుడు అన్న అయ్యర్ అప్పుడు తనకు హిందీ సరిగ్గా రాదన్న కారణంతో తప్పించుకున్నారని విమర్శించారు. ఆ వ్యాఖ్యల కారణంగా...
మోదీ క్లౌడ్ థియరీపై పేలుతున్న జోకులు తాజాగా కౌంటర్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్ అడవిలో భారతం చదువుతూ టెక్నాలజీ పొందారని ఎద్దేవా మేఘాలు రాడార్ ను అడ్డుకుంటాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ స్థాయిలో జోకులు పేలుతున్నాయి. తాజాగా ఈ విషయమై నటుడు, బెంగళూరు సెంట్రల్ లోక్ సభ సీటు స్వతంత్ర అభ్యర్థి ప్రకాశ్ రాజ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘‘భారత్ లో పౌరులందరికీ డిజిటల్ టెక్నాలజీ, ఈ-మెయిల్...
మా పోరాటం విద్వేష భావజాలంతోనే ప్రేమ కారణంగానే భారత పురోగతి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్నివర్గాలను, అసమ్మతి గొంతుకలను గౌరవిస్తామని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తెలిపారు. భిన్నమైన అభిప్రాయాలు, అసమ్మతి వ్యక్తం చేసే గొంతుకలను అణచివేయబోమని స్పష్టం చేశారు. ఓ లైన్ లో నిలబడ్డ చివరి వ్యక్తికి కూడా న్యాయం అందాలని గాంధీజీ చెప్పేవారనీ, దాన్ని తాము...
పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఘటన ఎన్నికల ప్రచారం సందర్భంగా కలిసిన బాలుడు సోషల్ మీడియాలో వీడియో వైరల్ సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ, వైసీపీ నేతలంతా ఏపీలో విస్తృతంగా పర్యటించారు. ప్రత్యర్థుల తప్పులను ఎత్తిచూపుతూ తమకే ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రికార్డు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జగన్ పర్యటన...
ఇంటర్ విద్యార్థులకు సంఘీభావంగా సభ హాజరైన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఓ కుర్చీ కోసం కొట్టుకున్న వీహెచ్, నగేశ్ తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్షా కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ సభలో ఓ కుర్చీ విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, నగేశ్ ల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో ఈ నేతలిద్దరూ ఒకరినొకరు తోసుకోగా,...
టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసింది 60 వేల మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు విజయవాడలో మీడియాతో వైసీపీ నేత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని వైసీపీ నేత పార్థసారధి విమర్శించారు. ప్రస్తుతం ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని కొట్టేసేందుకు చంద్రబాబు, ఆయన తాబేదార్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ సంస్థను కాపాడుకోవడానికి 60,000 మంది ఆర్టీసీ...
మే 23 తర్వాత మోదీ తిరస్కరణ ఖాయం మా పోరాటం ఈసీపై కాదు.. అధికారులపైనే మేం ఈసీని కలిస్తే మోదీ ఉలిక్కిపడుతున్నారు ఈ నెల 23 తర్వాత ప్రధాని మోదీని దేశ ప్రజలు తిరస్కరించడం ఖాయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తమ పోరాటం ఎన్నికల సంఘంపై కాదనీ, ఎన్నికల సంఘం అధికారుల పక్షపాత, వివక్ష ధోరణిపైనేనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్...