లాస్‌ ఏంజిల్స్‌: హాలీవుడ్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను విశేషంగా అలరించిన చిత్రం ‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌’. ఈ ఫ్రాంఛైజ్‌లో వచ్చిన చిత్రాలన్నీ ఆకట్టుకున్నాయి. అంతేకాదు, బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. ఈ నేపథ్యంలో త్వరలో మరో చిత్రాన్ని డిస్నీ స్టూడియోస్‌ తెరకెక్కించనుంది. ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. అయితే, గత ఐదు చిత్రాల్లో జాక్‌ స్పారో పాత్రలో అలరించిన జానీ డెప్‌ ఇక ఆ...
స్వస్థలానికి పోస్టింగ్‌ కావాలన్నాడు..ఇంతలోనే.. ఇండోనేషియాలో ఘోర ప్రమాదానికి గురైన విమానానికి దిల్లీకి చెందిన వ్యక్తి పైలట్‌గా వ్యవహరించారు. 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న లయన్‌ ఎయిర్‌ విమానం జావా సముద్రంలో కుప్పకూలింది. జకార్తా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది క్షణాలకే ఈ ప్రమాదం సంభవించింది. దిల్లీకి చెందిన భవ్యే సునేజా అనే 31 ఏళ్ల వ్యక్తి ఈ విమానానికి పైలట్‌‌గా వ్యవహరించారు. సునేజా చాలా అనుభవమున్న పైలట్‌ అని...
రెడ్‌హ్యాట్‌ ఐఎన్‌సీని సాఫ్ట్‌వేర్‌ రంగ దిగ్గజం ఐబీఎం కొనుగోలు చేసింది. దీంతో మరో అతిపెద్ద టెక్‌ డీల్‌ ఖరారైనట్లైంది. నగదు రూపంలో జరిగిన ఈ డీల్‌ మొత్తం విలువ 33 బిలిన్‌డాలర్లు(రూ.2.42లక్షల కోట్లు)గా అంచనా వేస్తున్నారు. ఈ కొనుగోలు‌తో ఐబీఎం క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలు అందించే టాప్‌ కంపెనీల జాబితాలో చేరినట్లైంది. రెడ్‌హ్యాట్‌ ఒక్కోషేర్‌కు ఐబీఎం 190 డాలర్లు చెల్లించనుంది. రెడ్‌హ్యాట్‌ షేరు శుక్రవారం మార్కెట్లో 116.68 డాలర్లకు ట్రేడైంది....
అంచనాల ప్రకారమైతే ప్రపంచ తొమ్మిదో ర్యాంకు జట్టయిన వెస్టిండీస్‌ పెద్ద ప్రత్యర్థే కాదు. ఈపాటికే భారత్‌ సిరీస్‌ గెలిచి ఉండాలి. కానీ ఆ జట్టు అనూహ్య ప్రతిఘటనతో పోరును ఆసక్తికరంగా మార్చేసింది. రెండో వన్డేను టైగా ముగించిన ఆ జట్టు... మూడో వన్డేలో 43 పరుగుల తేడాతో భారత్‌కు షాకిచ్చింది. సోమవారం నాలుగో వన్డేకు సిద్ధమైన టీమ్‌ ఇండియా లోపాలు సరిదిద్దుకోకుంటే ఇబ్బందులు తప్పవు. ఉత్సాహంగా విండీస్‌: టెస్టు సిరీస్‌ పరాజయం...
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న లయన్‌ ఎయిర్‌ విమానం సముద్రంలో కుప్పకూలింది. జకార్తా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది క్షణాలకే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఉదయం 6.20 గంటలకు జకార్తా విమానాశ్రయం నుంచి 181 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బందితో లయన్‌ ఎయిర్‌ విమానం సుమత్ర దీవుల్లోని పంగ్కల్‌ పినాంగ్‌కు బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయిన 13 నిమిషాలకే...
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్తాన్‌ ప్రథమ స్థానంలో ఉందని తాజా నివేదిక వెల్లడించింది. ఉగ్రవాదులను పెంచి పోషించే పాక్‌ కారణంగా అంతర్జాతీయ భద్రతకు పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ‘హ్యుమానిటి ఎట్‌ రిస్క్‌- గ్లోబల్‌ టెర్రర్‌ థ్రెట్‌ ఇండిసెంట్‌’  పేరిట ఆక్స్‌ఫర్ట్‌ యూనివర్సిటీ, స్ట్రాటజిక్‌ ఫోర్‌సైట్‌ గ్రూప్‌(ఎస్‌ఫీజీ) ఆర్టికల్‌ను పబ్లిష్‌ చేశాయి. ‘ప్రపంచ భద్రతకు అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన ఆఫ్గాన్‌ తాలిబన్‌, లష్కర్‌ ఎ తోయిబా, ఆల్‌ఖైదాకు...
విద్యార్థులకు మాతృభాష వచ్చినా, రాకపోయినా ఇంగ్లీష్ మాత్రం కచ్చితంగా రావాలంటూ స్కూలు యాజమాన్యాలు ఆంక్షలు విధిస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం చాలా మేరకు కనిపిస్తుంటుంది. అయితే అమెరికాలోని తెలుగువారు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. తమ మాతృభాష తెలుగును పిల్లలకు నేర్పించాలని తహతహలాడుతున్నారట. తెలుగు నేర్పించే ట్యూషన్ సెంటర్లకు తమ పిల్లలను పంపుతున్నారు. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ చేసిన తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఇందుకు సంబంధించిన...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్షిణకొరియా ప్రతిష్టాత్మక సియోల్‌ శాంతి పురస్కరాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ సహకారం, అభివృద్ధిలో కృషి చేసినందుకు 2018 ఏడాదికి గాను మోదీకి ఈ అవార్డు దక్కింది. భారత్‌ను అభివృద్ధి బాట పట్టించిన మోదీ.. ప్రపంచ శాంతికై పనిచేశారనీ, భారత్‌లో మానవ వనరుల అభివృద్ధితో ‘మోదినామిక్స్‌’ చేశారని, భారత్‌లో అవినీతి కట్టడికి ప్రధాని మోదీ కృషి చేశారనీ, నోట్ల రద్దు వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారని సియోల్‌ శాంతి...