సాక్షి, హైదరాబాద్‌: స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ (ఎస్‌ఎఫ్‌ఏ) ఫౌండేషన్‌ నుంచి రేపటి తరం పీటీ ఉష, మిల్కా సింగ్‌లు తయారవుతారని భారత ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అన్నాడు. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఏ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో అతను ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులను ఆనందపరిచారు. నేటి చిన్నారులే రేపటి తరం స్పోర్ట్స్‌ చాంపియన్‌లని అన్నాడు. ‘అత్యున్నత స్థాయి మౌలిక సౌకర్యాలు ఉండటమే కాదు. వాటిని సమర్థంగా...
తిరువనంతపురం: టీమిండియాతో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపింది. గత వన్డేలో భారీ విజయం సాధించి ఊపు మీద ఉన్న టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతుండగా, వెస్టిండీస్‌ సిరీస్‌ను సమం చేయాలనే యోచనలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమవ్వగా, విండీస్‌ మాత్రం...
కాన్‌బెర్రా: తమ టెక్నిక్‌ను మెరుగుపరుచుకునే క్రమంలో క్రికెటర్లు ఫుట్‌వర్క్‌ను సరిచేసుకోవడమనేది సాధారణ విషయమే. తన ఫుట్‌వర్క్‌ను గతం కంటే భిన్నంగా సవరించుకున్నఆసీస్‌ క్రికెటర్‌ జార్జ్‌ బెయిలీ ఇప్పుడు అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తున్నాడు. ఇలా కూడా బ్యాటింగ్‌ చేస్తారా అనే చందంగా తన బ్యాటింగ్‌ శైలిని మార్చుకున్నాడు బెయిలీ. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో దక్షిణాఫ్రికా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం ప్రెసిడెంట్‌ ఎలెవన్‌-దక్షిణాఫ్రికాల మధ్య ఒక రోజు ప్రాక్టీస్‌...
తిరువనంతపురు: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న ఐదో వన్డేలో వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది విండీస్‌. విండీస్‌ ఓపెనర్‌ కీరన్‌ పావెల్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరగా, ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు సాయ్‌ హోప్‌ సైతం పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌ తొలి ఓవర్‌లోనే పావెల్‌ వికెట్ చేజార్చుకుంది.భువనేశ్వర్‌ కుమార్‌ మొదటి ఓవర్‌ నాల్గో బంతికి...
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘రన్‌ మెషీన్‌’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే కోహ్లి ఇప్పటికే పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కోహ్లిని ఆదర్శంగా తీసుకున్న అతడి అభిమాని వరల్డ్‌ రికార్డు కోసం ట్రై చేస్తున్నాడు. అందుకు కోహ్లి రూపాన్నేఎంచుకున్నాడు. అర్థం కాలేదు కదా.! ఏం లేదండీ దీపావళితో...
హైదరాబాద్‌: టేబుల్‌ టెన్నిస్‌ క్రీడలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ క్రీడాకారుడు ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌ ప్రతిష్టాత్మక ‘ప్రపంచ జూనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌’లో పాల్గొననున్నాడు. ఆస్ట్రేలియాలో డిసెంబర్‌ 2 నుంచి 9 వరకు జరుగనున్న ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును సోమవారం ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచ జూనియర్‌ ర్యాంకింగ్స్‌లో 48వ స్థానంలో ఉన్న స్నేహిత్‌ భారత టీటీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అండర్‌–18 స్థాయిలో ప్రపంచ జూనియర్‌ టీటీ చాంపియన్‌షిప్‌...
వివిధ వేదికలపై పతకాలతో సత్తా చాటుతూ, భారత కీర్తి పతాకను ఎగురేస్తున్న రెజర్లకు తీపి కబురు. ఇప్పటి వరకు క్రికెట్‌ వంటి క్రీడల్లోనే ఉన్న వార్షిక సెంట్రల్‌ కాంట్రాక్టును త్వరలో వీరికీ వర్తింపజేయాలని భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న 150 మంది రెజ్లర్లు ఈ కాంట్రాక్టు పరిధిలోకి రానున్నారు. ‘ఎ’ నుంచి ‘ఐ’ వరకు కేటగిరీలుగా విభజించి వర్తింపజేయనున్న కాంట్రాక్టులో రెజ్లర్లకు ఏడాదికి గరిష్ఠంగా రూ.30 లక్షలు,...
పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–ఆర్తెమ్‌ సితాక్‌ (న్యూజిలాండ్‌) జంట రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. పారిస్‌లో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో దివిజ్‌–సితాక్‌ ద్వయం 6–4, 6–3తో ఫెలిసియానో లోపెజ్‌–మార్క్‌ లోపెజ్‌ (స్పెయిన్‌) జోడీపై విజయం సాధించింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో దివిజ్‌ జంట ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. రెండో రౌండ్‌లో మైక్‌ బ్రయాన్‌–జాక్‌ సోక్‌ (అమెరికా)...
హైదరాబాద్‌ : మహేంద్ర సింగ్‌ ధోని.. భారత్‌కు ఐసీసీ టైటిళ్లన్నీ అందించిన ఏకైక సారథి. ప్రస్తుతం నిలకడలేమి ఆటతో విమర్శకుల నోట అతని పేరు ఎక్కవగా వినిపిస్తోంది. కానీ.. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు (అక్టోబర్‌ 31 2005) విధ్వంసం సృష్టించాడు. క్రికెట్‌ చరిత్రలోనే ఓ కొత్త అధ్యయానికి తెరలేపాడు. శ్రీలంకపై 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో విధ్వంసకరం అంటే ఎంటో ప్రపంచానికి రుచిచూపించాడు. అంతకు...